యము రు 50 లను, పట్టణ గ్రంథాలయము రు 300 లను, ప్రాంత గ్రంథాలయము రు 700 లను సంపాదింప గలిగిన యెడల, మహారాజావారు అంతసొమ్మును ఇచ్చెదరు. జిల్లా బోర్డు వారు ఇంకొక యంత సొమ్మ నిచ్చెదరు.
ఈ సూత్రమే గ్రంథాలయ భవనములు విషయమున గూడ నవలంబింప బడినది. ఒకవంతు సొమ్ము చందాల మూలమున వసూలై నయెడల, మిగిలిన రెండు వంతులలో ఒక వంతు ప్రభుత్వము వారును రెండవ వంతు జిల్లాబోర్డువారును ఇచ్చెదరు. గ్రంథాలయము స్థాపింప లేని స్థలము లందు పఠనమందిరములను పెట్టినను ఈ రీతినే సహాయము చేయుదురు. సంచార గ్రంథాలయ పేటికలను గ్రంథాలయములును, పఠనమందిరములును గూడ తెప్పించుకొని ఉపయోగించుకొనవచ్చును. పట్టణ గ్రంథాలయములుగాక 198 గ్రామ గ్రంథాలయములును 91 పఠన మందిరములును గలవు. 89 గ్రామగ్రంథాలయములకు స్వంతభవనములుగలవు. ప్రభుత్వము వారి పోషణకింద నున్న ఈ గ్రంథాలయములు గాక ప్రత్యేకము చందాలవలన పోషింపబడు 15 గ్రంథాలయములు గలవు. ఇందులో ఒకటి ప్రత్యేకము స్త్రీలకు చెందియున్నది. గ్రంథములు సంచారగ్రంథాలయ పేటికలమూలమున గూడ వ్యాపకము చేయబడు చున్నవి. 15 మొదలు 30 పుస్తకములవరకు ఒక పెట్టెయందు పెట్టి ఉంచెదరు. అట్టిపెట్టెలకే సంచార గ్రంథాలయ పేటికలనిపేరు. పేటికలను ఏగ్రంథాలయముగాని, పాఠశాలగాని, సంస్థగాని, లేక తన గ్రామమందు చదువుకోనటకు ఎరువిచ్చుటకై అంగీకరించిన ఏపెద్ద మనిషి గాని ఎరు ప్రతీసికొని రెండు మొదలు మూడు మాసముల వరకు ఉంచుకొనవచ్చును. గ్రంథములను ఉచితముగానే చదువు కొననిచ్చెదరు. రైలుఖర్చులను గూడ కేంద్ర గ్రంథాలయమే భరించును. జనసామాన్యమందు విద్యను వ్యాపింపజేయుట యొక్క ప్రాశస్త్యమును ఆంగ్లేయ దేశమందొక శతాబ్దమునకు పూర్వమే గుర్తింపబడినది. గడచిన పాతిక సంవత్సరములలో ఈ యభిప్రాయము అమెరికా దేశమందు వ్యాప్తమైనది. ఆ దేశమందు వ్యాపించియున్న రీతిని సంచార