Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములను ఎరువు దీసికొను వారి సంఖ్య 3,673. పుస్తకములుండు బీరువాలకు తలుపులు పెట్టకుండ, అందరిని బీరువాలునుండి పుస్తకములను ఏరుకొననిచ్చు పద్ధతి అమెరికా దేశములో సర్వసామాన్యముగా నున్నది. ఆ పద్ధతిని బోర్డన దొరగారు బరోడాయందు గూడ వ్యాపింప జేసిరి. గ్రంధముల పట్టికనుండి పుస్తకములను ఏర్చుకొనుట కంటె, బీరువాలనుండి పుస్తకములను పరిశీలించి, స్వయముగా తీసికొనుట వలన గ్రంథాలయము చదువరికి అమీతమైన ఉపయోగమును కలుగ జేయును. ఈ పద్ధతి గలుగు నష్టములు స్వల్ప వివరములందు మాత్రము గలవు. అవి కొంచెము జాగ్రతవలన సర్దుబాటు కాగలవు. 200 కంటె ఎక్కువ పత్రికలు గలిగిన పత్రికా పఠనమందిరము ప్రతిదినము 12 గంటల కాలము తెరచి యుంచబడును.. కేంద్ర గ్రంథాలయము పక్షమున నడుపబడు వివిధములగు పనులలో పిల్లల శాఖ యొకటి. దీనియందు ఇంగ్లీషు తెలియని పిల్లలకు పనికివచ్చు 2000 గ్రంథములు గలవు. పిల్లలు ఆటలాడు కొనుటకు ప్రత్యేక మొకగది గలదు. ఈ శాఖయందు బాలురు తమ ఇంటియం దుండునంత కులాసాగానే యుండి, తమకు నచ్చిన ఆటల నాడుకొందురు. ఈ శాఖ స్త్రీ గ్రంథ భాండాగారి యధీనమందున్నది. ఈ స్త్రీగఁథ భాండాగారి యే మహిళాగ్రంధాలయమును గూడ జూచుచుండును. ఈ మహిళా గ్రంథాలయమునకు ప్రత్యేకముగ పుస్తకములును పత్రికలును గలవు. పట్టణమునందు గల మూడు స్త్రీ సంఘములకు బోయి ఈ స్త్రీ గ్రంథ భాండాగారి పుస్తకములను చదువు కొనుట కిచ్చుచుండును. క్రిందటి సంవత్సరము ఈ మహిళా గ్రంథాలయ శాఖయందు 18, 209 గ్రంథములు జదువబడెను. ఇవిగాక 4,039 గ్రంథములను పిల్లలు జదివిరి. సంస్కృత భాగమందు 5412 ముద్రిత గ్రంధములును, 13,09 అముద్రిత గ్రంథములును గలవు. సంస్థానమందంతటను మహారాజు గారి సహాయముతో గ్రంథాలయములు స్థాపింపబడినవి. అక్కడ గ్రంథాలయములు 3 విధములు. గ్రామ గ్రంథాలయములు, పట్టణ గ్రంథాలయములు, (నాలుగు వేల జనాభా గలిగిన పట్టణము లందలివి) ప్రాంత గ్రంథాలయములు (జిల్లాపట్టణ మందలివి) పల్లె గ్రంథాల