Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన మహారాజు ప్రథమస్థానమును ఆక్రమించెను. బరోడా యందు గ్రంథాలయ శాఖ రాజ్యాంగము నందొక శాఖగ ౧౬ సంవత్సరముల క్రిందట ప్రారంభింపబడెను. అమెరికా శాస్త్ర వేత్తయగు బోర్డను దొరగారిని ఈపనికై నియోగించెను. కేంద్ర గ్రంథాలయమును స్టాపించెను. సంస్థానము యొక్క అన్ని భాగము లందును తన పోషకత్వము క్రింద గ్రంథాలయములను పఠనముందిరములను స్టాపింపజేసెను. హిందూ దేశమందెల్ల ప్రథమ గ్రంథాలయ పాఠ'శాలను స్థాపించెను. బోర్డను దొర మూడు సంవత్సరములు పనిజేసెను. పిమ్మట కుడు హెూల్కారు గారు ఆస్థానమును వహించి సత్వరాభివృద్ధిని జూపిరి. బరోడా కేంద్ర గ్రంథాలయమందు ౮ శాఖలు గలవు.

(౧) గుమాస్తాలు, నౌకరులు (2) పుస్తకముల నెరువిచ్చు శాఖ (3) పుస్తకముల పట్టిక, ఇంటికి ఎరువియ్యని గొంథములు (౪) పఠన మందిరము (౫) పిల్లల స్త్రీల శాఖ (౬) మహిళా శాఖా గ్రంథాలయము (౭) సంస్కృత భాగము, సంస్కృత గ్రంథ ప్రకటన సహితముగ (౮) గ్రంథములకు అట్టలను కట్టు శాఖ.

గ్రామగ్రంథాలయ శాఖయందీ విభాగములు గలవు:౼ ( 1) పట్టణ, గ్రామ గ్రంథాలయ భాగము (౨) సంచార గ్రంథాలయ శాఖ (3) ప్రదర్శన శాఖ,

కేంద్ర గ్రంథాలయమందు 98,964 గ్రంథములు గలవు. ఇవిగాక 18,543 గ్రంథములు సంచార పేటికలందు గలవు. 1910 సంవత్సరము నందు మహారాజాగారు తమ స్వంత గ్రంథాలయమందు గల 20,000 గ్రంథములను అందరి ఉపయోగమునకై ఇచ్చి వేసెను. ఇప్పుడాయన తన సంస్థాన ప్రజలలో నొకరుగానే ఆ గ్రంథముల ఉపయోగమును పొందు' చున్నారు. కేంద్ర గ్రంథాలయము నందు గతవత్సరము 96,927 గ్రంథులు చదువబడెను. ఇవిగాక పట్టణ మందు సంచార గ్రంథాలయ పేటికలనుండి 6,136 గ్రంధములు చదువబడెను. హిందూదేశమందు ఏ గ్రంథాలయ మందును ఇంత ఎక్కువ గ్రంథములు చదువబడి యుండలేదు. కేంద్ర గ్రంథాలయము పట్టణ వాసస్టు లందరికిని ఉచితము. ఈ గ్రంథాలయమునుండి గ్రంథ