వివిధవిషయములను గూర్చి వివరించు చక్కని గ్రంథములు గలిగిన నట్టి సంచార గ్రంథాలయ పేటికలు కొన్ని ప్రతి గ్రంథాలయము నందును ప్రత్యేకింపబడియుండును.
భాండాగారి గ్రంథాలయములు లేని గ్రామములకుబోయి తాను తెచ్చిన పుస్తకముల పట్టికలను జనులకు పంచి పెట్టి వారికి పఠనాభిలాషను కలుగ జేయును. అంతట గ్రామస్థులు ఒక్కరొక్కరే విచ్చేసి గ్రంథములను గొనిపోయి చదివెదరు. ఆగ్రామస్థులు చదువుట ముంగించిన పిమ్మట సంచార గ్రంథ భాండాగారి ఇంకొక గ్రామమునకు బోవును. విద్యార్థులకును, ఉపాధ్యాయులకును ఉపయుక్తములైన గ్రంథములను అలమారులలో బెట్టి వాటిని పాఠశాలలందలి ఉపాధ్యాయుల వశమునందు విడచెదరు. ఆపుస్తకములు విద్యార్థులు చదువునటుల ఉపాధ్యాయులు అభిరుచిని గలిగించెదరు. ఆప్రకారము ఒకసారి తెచ్చిన పుస్తకములను ముగించిన పిమ్మట గ్రంథ భాండాగారి ఆ పుస్తకములను గొనిపోయి వేరొక అలమారును బంపును. జ్ఞానమును వ్యాపింప జేయుటకుగాను ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలకు ఈవిధముగా గ్రంథాలయములు తోడ్పడును. గ్రంథములు స్వయముగా చదుకొనజాలని జనులు నివసించు ప్రదేశములకు గ్రంధభాండాగారి వెళ్ళి వారికి కావలసిన గ్రంథములను చదివి వినిపించును. విద్యార్థులు యాత్రలకు వెళ్లినప్పుడు ఆవిద్యార్థులకు కావలసిన విషయములనుగూర్చి బోధింపగలిగిన విజ్ఞాని నొకనిని గ్రంథాలయమువారితో గూడ బంపును. ఫ్యాక్టరీల గుమ్మములయొద్ద ఫ్యాక్టరీకూలీలకు ఉపక్తములగు గ్రంథముల పట్టికలను అతికించి ఆగ్రంథములు చదువుటకు అభిరుచిని గలిగించెదరు. ఈవిధముగా సంఘమునందుండు అన్నిరకమల జనులకును అమెరికా దేశ సార్వజనిక గ్రంథాలయములు వివిధమార్గముల ఉపయుక్తములగు చున్నవి.
భారతవర్షమును బరోడా దేశము మార్గదర్శకముగ నున్నది. హిందూ దేశమునందున్న స్వదేశసంస్థానము లన్నింటిలోకి నిర్బంధ ఉచిత ప్రారంభవిద్యను అమలులో పెట్టుటయందేగాక అమెరికా దేశపద్ధతుల మీద గ్రంథాలయోద్యమమును ప్రారంభించుటకుగూడ బరోడా