గారపక్షమున బెజవాడలో ఇట్టి విధానము ననుసరించి తాత్కాలిక పాఠశాల మూలమున దాదాపు ఇరువదిమంది యువకులకు విద్యా దానము జరిగినది. మన దేశమందు స్థాపించవలసిన తాత్కాలిక పాఠశాలల విధానమును వెంటనే యెట్లు జరుగగలదో వివరించుటకుగాను కృష్ణాజిల్లాయందున్న పరిస్థితులనుబట్టి మనము చేయవలసిన దేదో తప్సీలుగా రాబోవు సంచిక యందు తెల్పెదను.
-సూరి వేంకటనరసింహశాస్త్రి
“స్వీడను” దేళమందు గ్రంథాలయోద్యమము
ఒకశతాబ్దమునకు పూర్వమే “స్వీడను” దేశమందు గ్రంథాలయోద్యమము ప్రారంభ మాయెను. ధర్మగ్రంథాలయములకు సంబంధించిన చట్టమొకటి ౧౮ 30 వ సంవత్సర ప్రాంతమందే, ఆ దేశము యొక్క “నేషనల్ పార్లమెంటు నందు ఉపపాదింపబడెను; పాఠ శాలల యొక్క పనికి సహకారిగా నుండుటకు గాను పొదిరీలకు సంబంధించిన గ్రంథాలయములను స్థాపించుటకై ఆచట్టము అనువదింపబడెను; కాని కాలము పక్వముగాక పోవుటచే ఆ చట్టమును అంగీకరింపలేదు. ౧౮౩౫ "వ సంవత్సరమునందు ఈ అభిప్రాయముతోనే "కారల్ స్టాండు” పట్టణమునం దొక సంఘము స్థాపింపబడెను. పిమ్మట ౧౮౬౦ రాజం వ సంవత్సర ప్రాంతమందు “సిల్ జస్ట్రాం" అనునాయన అమెరికా దేశయాత్రకు వెళ్ళివచ్చిన నాటనుండియు, ధర్మగ్రంథాలయాభివృద్ధి పొడసూపసాగెను. పారిశ్రామిక సంఘములు, మితపాన సంఘములు మున్నగు ప్రజాసంస్థలు తమ స్వంత గ్రంథాలయములను స్థాపించుకొనుటకై ప్రారంభించెను.
అనేక ప్రయత్నములు జరిగినపిమ్మట, ప్రభుత్వము వారివల్ల గ్రంథాలయములకై ప్రథమ విరాళము ౧౯౦౫ వ సంవత్సరమున