యములు పదునాలుగింటికిని వేరువేరు గ్రంథ వివరణ పట్టికలు గలవని చెప్పియుంటినిగదా! పట్టికలన్నియు ఒక విధానము ననుసరించి తయారైనవిగూడ గాదు. అందుచేత ఒకరు ఒక గ్రంథమునకై వెనుకవలె నన్నచో తనకు కావలసిన గ్రంథము దొరకు వరకును గ్రంథవివరణ పట్టికల నన్నిటిని వెదుక వలసియుండును. అందువలన అనవసర కాలహరణము గలుగుచుండును. చదువు కొన్న పండితుడు అనవసరకాలహరణము నెంతమాత్రమును సహింపజాలడు. అందుచేత యీ పట్టికలన్నింటి నుండియు సమగ్రమగు పట్టిక నొకదానిని తయారు జేయుటకు ఏర్పాటులు జరుగుచున్నవి.
ఈ గ్రంథాలయము యొక్క గ్రంథ వివరణ పట్టికను తయారు జేయుటకై అమెరికా దేశమదంలి “కార్నీ జీ ఎండోమెంటు” వారు సహాయము జేసినారు. “రోము” నుండి నలుగురు మహాను భావులు గ్రంథవర్గీకరణపద్ధతిని చదువుకొనుటకై అమెరికా దేశమున కేగినారు. వారి చదువు పూర్తియైన పిమ్మట తమ దేశమునకు బోయి ఈగ్రంథాలయమునందు చేయవలసిన పనిని అందుకోనెదరు.
సహకార గ్రంథాలయము, కావలి
నెల్లూరుజిల్లా కావలి పట్టణములో “సహకార గ్రంథాలయ” మను పేర ఉచిత గ్రంధాలయము, పఠనమందిరము 8-11-28 న స్థాపింపబడినది. ప్రస్తుతము 150 గ్రంథములు గలవు. కావలి గ్రామములో పనిచేయు సహకార సంఘములు సముదాయపు నిధితోను ఉదార హృదయుల సహాయముతోను ఈ సంస్థ పోషింప బడవలసియున్నది. కావున అందరు సహాయము చేయ బ్రార్థితులు.
౼సిద్దాంతి వెంకట పిచ్చయ్య, బి. ఏ.,
వ్యవస్టానాపకుడు