Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.5 (1928).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాలును చిత్రింపబడి యున్నవి. ప్రసిద్ధపురుషుల నిజప్రతిమలు స్తంభముల మీద చిత్రింపబడి యున్నవి. ఈప్రతిమలన్నియు భవనము యొక్క సరంబీని మోయుచున్నటుల జూపట్టును.

ఈ గ్రంథాలయమందున్న గ్రంథములన్నియు ముఖ్యముగా చారిత్రాత్మక మైనవి; ఇట్టి గ్రంథములు ౬౦,౦౦౦ లకు పైగా గలవు. ఈగ్రంథాలయమందు అనేక శతాబ్దములందు సేకరింపబడిన 5,00,000 అచ్చు గ్రంథములు గలవు. ఇవిగాక లాటిను భాషయందు చేతితో వ్రాయబడిన 3౭ 000 గ్రంథములు గలవు. గ్రీకు భాషయందు చేతితో వ్రాయబడిన ౪౨౯౦ గ్రంథములును, "తూర్పు దేశ భాషలయందు చేతితో వ్రాయబడిన ౪౦౦౦ గ్రంథములును గూడ గలవు. ఇప్పటికిని మతగురువునకు వ్రాత గ్రంథములు సమీకరణ మనిన మిక్కిలిబ్రీతి, “మెస పటోమియా” లో కొన్ని వ్రాతగ్రంథములు దొరుకునని తెలసి, వానిని సంపాదించుటకుగాను క్రిందటి సంవత్సరమే మతగురువుగారు ప్రతినిధి నంపెను.

౧౫౯౧ సంవత్సరముమొదలు ౧౯౨౬ సంవత్సరమువరకు ఈగ్రంథాలయమందు గ్రంథముల యొక్క గొప్ప సముదాయములు పదునాలుగు చేర్పబడినవి. ప్రతిసముదాయమును ప్రత్యేక స్థానమునందుంచిరి. ప్రతిసముదాయమునకును ప్రత్యేకముగ గ్రంథవివరణ పట్టిక గలదు. “ప్లాటినా" అనునాయన కాలము నుండియు యీగ్రంథాలయముల యొక్క గ్రంథ భాండాగారిలకుందరు ఇందుగల అమూల్య గ్రంథములను విభజించి గ్రంథవివరణ పట్టికలను తయారు జేయుటయందే తమజీవితములను ధారబోసిరి. పదునేడవ శతాబ్దాంతమున తయారు చేయబడిన ఈగ్రంథాలయమందలి గ్రంథముల జాబితా యిరువది తొమ్మిది పెద్ద “వాల్యూము” లందు గలదు; లిపి శాస్త్ర మందు పండితులగువారిచే యీజాబితాలు తయారుచేయబడినవి. తరువాత శతాబ్దములందు గూడ గ్రంథముల జాబితాలు తయారుచేయబడి