నశింపు చేయబడుటయో, చెల్లా చెదరై పోవుటయో తటస్థ మగుచుండెను. మతకలహములును వానిచేగలిగిన హింసలును దీనికి కారణములు. ౧ర౧౭ సంవత్సరము నందీ గ్రంథాలయము ఒక మత గురువుచేత స్థాపింపబడెను. అతను జయించి తెచ్చిన 3౪౦ గ్రంథములదే దీనికి ప్రాతిపదిక. అప్పుడిది 'రోము' పట్టణమందు స్థాపింపబడినది.
ఆయనకు పిమ్మట 'నికోలస్' అనునాయన మతగురుస్థానమునకు వచ్చెను. ఆయనకు పుస్తకములన్న మిక్కిలి ప్రీతి. గ్రంథ సమీకరణమునకై ఐరోపా దేశమునకే గాక గ్రీసు - కాస్ స్టంటునో పిలువరకు ౧౪గూడ ఆయన పండితుల నంపెను. ఆయన ౧౪౫౫ సం॥రమున చనిపోవుసరికి ఒక వెయ్యి గ్రంథములా గ్రంథాలయ మందు చేరెను.
౧౪౬౪ సంవత్సరము నందు చనిపోయిన 'పియన్' అను గొప్ప శాస్త్రవేత్త తన కుటుంబమునకు విడిచి పెట్టిన గ్రంథముల సంగ్రహమంతయు గూడ ఈగ్రంథాలయమునకు జేరెను.
‘సిక్సుటసు’ అనుమతగురువు విద్యావంతుడు గాకపోయినను యితరులందరికంటె యీగ్రంథాలయమున కెక్కువ సహాయము చేసెను. తాను మతగురుస్థానమునకు యెన్ను కొనబడిన వెంటనే గ్రంథముల సన్నిటిని ఒక యేర్పాటు ప్రకార ముంచి దివ్యమైన భవనము నందుంచెను. గ్రంథాలయమంతయు మూడు భాగములకింద భాగించి నాలుగు చావళ్ళయం దుంచెను. ఇందులో మూడుచావళ్ళయందు లాటిను, గ్రీకు భాషాగ్రంథము లుంచబడెను. ఈమూడు చావళ్ళ లోనికిని ప్రజాసామాన్యమంతయు వచ్చి చదువుకొనవచ్చును. నాలుగవ చావడి మాత్రము మతగురువుగారి స్వంత గ్రంథాగారము కొరకు ప్రత్యేకింప బడినది. ఆ కాలమునాటి సుప్రసిద్ధ చిత్రకారు లిద్దరిచేత ఈ చావడులు అలంకరింపబడినవి.
పిమ్మట “పాటినా” అను నాయనను యీ గ్రంథాలయపాలనకు నియోగించిరి. ఈయన గ్రంథముల కొరకేకాక పనివారలను తనిఖీ