శ్రీ నాగేశ్వరరాయ గ్రంథాలయము
నరసన్న పేట
ఈ గ్రంథాలయము చిరకాలము నాగేశ్వరరాయ గ్రంథాలయసంఘమువారి యాజమాన్యమున జక్కగ పనిచేసి ఉత్సాహము తగ్గుటచే మూడేండ్ల కాలము పాటు శ్రీయుతులు పొట్నూరు స్వామి బాబుగారి వశమందుండి, వారిచే నియూరి సోషల్ క్లబ్బువారికి యెఱవుగా నీయబడినది. గ్రంథాలయ సంఘము ఆరుమాసములక్రిందట బునరుద్ధరింపబడినది. ఆసంఘమున ప్రకృతము 60 మంది సభ్యు లున్నారు. పౌరాదరము బాగుగా గలదు. గ్రంథముల నుంచుకొనుటకు అందఱకు అందుబాటుగా నున్న శ్రీ వేంకటేశ్వరాలయము నందు వసతి యేర్పరుపబడినది. సోషల్ క్లబ్బువారిని తమ గ్రంథాలయము తిరిగి యిమ్మని పౌరులు అడిగినను ఇంతవఱకును గ్రంథాలయము నీయలేదు. ఆసోషల్ క్లబ్బు పూరియిల్లు; పాడుపడి యున్నది. అందలి సభ్యుల కాటలమీదనున్న యాదరము చదువుమీద లేదు. ఎవరికి తోచిన పుస్తకము వారు తీసికొని పోయి మరల యియ్యకున్నట్లు తెలియుచున్నది. బీరువాలు పాడుపడి చెక్కలూడిపోయి యున్నవి. అవి బాగు చేయింప లేదు. ఎలుకలుపుస్తకములు కొటికి వేయుచున్నవి. గ్రంథాలయము నూరి వారి కీయ మనుటకు సోషల్ క్లబ్బువారి కేమి యధికారము గలదు? గ్రామస్థులు స్థాపించి గ్రామస్థు లభివృద్ధి పరచిన గ్రంథాలయము గ్రామస్థులకు గాక నౌకరీకి వచ్చిన యుద్యోగుల కెట్లు చెల్లును? ఈ గ్రంథాలయము విషయమై గ్రామస్థులు కోర్టుద్వారా చర్య జరుపనున్నారు. ఇంతకును సోషల్ క్లబ్బు పేరుతో నున్న వారు మూడున్నర మనుష్యులే. వారిలోను గొందఱు సద్బుద్ధి గలిగియే యున్నారు. వారికి మావందనములు, వారు చేయదగిన సాయము చేయుదురనియు నాశించుచున్నాము. ఇంక మిగిలిన రెండు మూడు వ్యక్తులు మాత్రమే యీ మొరకుదనము వహించి యభివృద్ధి కాటంకము కలుగజేయు