ఒక అడుగు వెడల్పుగలది గాను రెండడుగులు పొడుగుగాను యుఁడును. ఇది ఒక అరవలె నుండును. ముందు భాగమందు రెక్కల తలుపులు అమర్చబడియుండును. ఈ పెట్టె లోపలిభాగము రెండుగా విభజించబడి యుండును. పై భాగము రమారమి ఒక అంగుళము వెడల్పుగాను మిగిలిన దంతయు రెండవభాగముగాను యుండి ఈ రెండుభాగముల మధ్యను ఒక బల్ల అమర్చబ బల్ల అమర్చబడి యుండున ఈ పెట్టెకు రెండు వైపులను పట్టుకొనుటకును, తాడు కట్టుటకును వీలుగా నుండునట్లు గొళ్ళెములు వేయబడియుండును. పెటెయొక్క పైఅరయందు కాగితములు రిజిటర్లు పెట్టుకొనుటకును అడుగు భాగమంతయు పుస్తకములు పెట్టుటకును ఉపయోగపడును. రెండు వైపుల నుండు గొళ్ళెములకు తాడు కట్టి కట్టకు తగిలించి బుజమున పెట్టుకొని చులకనగా ఈ గ్రంథాలయ పేటికను తీసికొని పోవచ్చును.
ఇట్టి పేటిక నొకదానిని టేకు చెక్కలతో చేయుటకు రు 10 ల ఖరీదుకు మించదు. ఇందుంచవలసిన గ్రంథముల ఖరీదు రు 40 లు గా మదింపు చేయవచ్చును. సంవత్సరమునకు రు 500 లు ఈమూలమున వ్యయ పెట్టుటకు తాలూకా బోర్డునా రంగీకరించినచో ఇందుతో 10 పెట్టెలను సంగ్రహించవచ్చును. సంవత్సరములు గడచిన కొలది ఈ పేటికల సంఖ్య హెచ్చగును. ఈ పెట్టెలను తాలూకా బోర్డు కచేరీ లో నుంచవచ్చును. ఇచ్చటనుండి ఈ పెట్టెలను కొన్నిటిని ఒక సెంట్రలు - క్లాసుకును మరిన్నిటిని మరియొక సెంట్రలు క్లాసుకును చేర్చి అచ్చటనుండి ఉపాధ్యాయుల ద్వారా గ్రామములలో వ్యాపింప చేయవచ్చును.
పైన చెప్పిన అన్ని పనులను తాలూకాబోర్డులును జిల్లా బోర్డులును మ్యూన్సిపాల్టీలును వెంటనే పారంభింపవచ్చును. ఇందుకొరకు వెచ్చించ వలసిన ద్రవ్యము అంతగా నుండదు. నూతనముగా నియమించ వలసిన సిబ్బందీయును ఉండ నక్కరలేదనియే చెప్పవచ్చును.
స్కూళ్ళ డిప్యూటీ ఇ౯ స్పెక్టరు జీతమును గవర్నమెంటు వారే యిచ్చుచుందురు గదా. మ్యాజిక్కు లాంతరును మాత్రము తాలూకా బోర్డు కొని యియ్యవలెను, ఇదిగాక ఒక్కొక్క తాలూకా బోర్డు