చదువురానివారికి జ్ఞానోదయము చేసి అభివృద్ధి నొందించుటకు మార్గము లెన్ని యోగలవు. సంచారోపన్యాసకులను నియమించి వారి మూలమున పల్లెటూళ్లలోను, బస్త్రీలలోను, మ్యాజిక్కులాంతరు మొదలగు యంత్రసహాయముతో - ఆయాచోట్ల నివసించు ప్రజల యొక్క స్థిగతులనుబట్టియు వారి కుండు జ్ఞానసంపత్తును బట్టియు అవసరమగు భేదముల నవలంబించి, ప్రజాసామాన్యమునందు విద్యాభివృద్ధి చేయవచ్చును. బొమ్మలుగల పటములు కార్డులు మొదలగు పరికరముల మూలమునకూడ ఈ ఫలమును పొందవచ్చును. హరికథా రూపముస పాటలు పద్యములు మొదలగు జనరంజకమగు సాధనముల నవలంబించి కేవల మతసంబంధ మైనట్టియు నీతిసంబంధ మగునట్టియు విషయములను గూర్చియేగాక జనసామాన్యమునకు ముఖ్యముగా కావలసిన ఆరోగ్యము, చరిత్ర, భూగోళము, శరీరశాస్త్రము, వ్యవసాయశాస్త్రము, ప్రకృతిశాస్త్రము మొదలగు విషయములను గూర్చి ప్రజలకు బోధించవచ్చును. ఇంకా పురాణపఠన పద్ధతి నవలంబించి కూడ ప్రజా సామాన్యమునకు విద్యాభివృద్ధి చేయవచ్చును.
తమకు కావలసిన విషయములను చదువుకొనగల్గియు చదివిన దానిని అర్ధము చేసికొన లేనివారి యుపయోగము కొరకు, తాత్కాలిక పాఠశాలలను స్థాపించవచ్చును. ఈ విషయము విపులముగా రాబోవు సంచికయందు వివరింపబడును. పుస్తకములను అపేక్షించువారికొరకు స్థాయి గ్రంథాలయములను, సంచార గ్రంథాలయములను స్థాపించవలసియున్నది.
ఈ యన్ని సంస్థలకు ముఖ్య సాధనము దవ్యము. రెండవది వీనిని నడుపుటకు తగిన కార్యనిర్వాహకులు.
మొట్టమొదట తాలూకా బోర్డులును, జిల్లా బోర్డులును మన కీవిషయకున ఏట్లు పకరించునో నిర్ణయించెదము.
మనకిప్పుడు ప్రతి తాలూకాకును ఒక్కొక స్కూళ్ళ డిప్యూటీ ఇక్ స్పెక్టరు ఉద్యోగి యున్నాడు. ఈ అధికారికి మ్యాజిక్కులాంతరుసు సప్లయి చేయవలెను. ఈయన తన కింద ఉండు పాఠశాలో పాధ్యాయుల యుపయోగము కొరకు అచ్చటచ్చట కూడలి స్థలములందు