అఖిల భారత గ్రంథాలయసభ
ఆరవ అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధులనుహాసభ డిశంబరు నెల ఆఖరు వారమున కలకత్తా పట్టణమునందు జరుగును. పలుకు బడిగలిగిన ఆహ్వాన సంఘము ఏర్పడినది. డాక్టరు రవీంద్రనాధ ఠాకూరు గారు ఆహ్వాన సంఘాధ్యక్షులుగాను, బిపిన్ చంద్రపాలు గారు, డాక్టరు కుమార నరేంద్ర నాధలా యం. ఏ. బి. ఎల్. గారును ఉపాధ్యక్షులుగాను, పండిత అమూల్యచంద్ర విద్యాభూషణ గారు కార్యదర్శిగాను ఎన్నుకొనబడిరి. ఈసభతో బాటు అఖిలభారత ప్రదర్శనముగూడ జరుగును. ఆంధ్రదేశ గ్రంథాలయసోదరు లందరును విచ్చేయబ్రార్థితులు.
రత్న గ్రంథాలయము
భరతఖండమున వంగ దేశము సుప్రసిద్ధము. అందు “వీరభూమి” యను సార్థక నామధేయముగల జిల్లా గలదు. ఆజిల్లాయందున్న “సూరి” గ్రామమందు విద్యాభిలాషి యగు "శివరత్న మిత” యను గృహస్థు గలడు.
ముప్పది సంవత్సరముల క్రిందట ఆయన వంగ దేశమందలి ప్రాచీన ఆధునిక గ్రంథకర్తలందరి యొక్క జీవచరిత్రలను దెలుపు నిఘంటువు నొకదానిని వ్రాయవలెసని సంకల్పించెను. అంతకు ముందెవ్వరును ఈ మహత్తర కార్యమునకు గడంగియుండలేదు. అందుచేత ఆయన తనపరిశోధనకు గాను గ్రంథములయొక్క అచ్చుపతులను, అచ్చుకాని వ్రాతపత్రులను సేకరించుటకు ప్రారంభించెను. పరిశో