24
8ܦ గ్రంథాలయ సర్వస్వము, సాయంకాలమునకు యిచ్చి వేయవలెను అట్లు యివ్వలియడల మార్చి 11 తేదీ యుదయమునుండియు ఆలస్యమును పరిగణింపవలెను. అప్పుడు ఆలస్యపు తాఖీదునుపంపవలెను. అట్టివారికి జరిమానా విధింపవచ్చును. కొన్ని గ్రంథాలయములలో ఆలస్యమైన ప్రతిదినమునకు కొంత జరి మానా విధించుట ఆచారమైనది. కాని మన దేశమున నట్లు చేయుట ఆచరణ యోగ్యముకాదు. ఏలనన పాలకుడు చదువరుల నాకర్షించు టకు సర్వదా ప్రయత్నము చేయుచుండవలయును. జరిమానావలన చాలమంది చదువరులు భయపడుదురు. మెదటిసారి చవదువరిని హెచ్చరించుటయు, రెండవసారి కొన్ని దినములవరకు గ్రంథముల నివ్వక ఆపుటయు, మంచిపద్ధతి. చదువరి యింకను అశ్రద్ధ చేయు చుండిన యెడల చాలదినములవరకు గ్రంథమునిచ్చుట మాని వేసి ఈవిషయమును నోటీసు బల్లపై ప్రచురింపవలెను. ఈపద్ధతి సాధా రణ జను లందరివద్దను జయప్రదమైనట్లు నాఅసుభవము తెల్పుచున్నది. ఈనిబంధనకు యెప్పుడు లోటు రానివ్వకూడదు. ప్రతి గ్రంథాలయమునందును దరఖాస్తురిజస్టరు నుంచుట దరఖాస్తు ఫారము కార్డుపై శ్రీకర్తవ్యము. అచ్చువేయించవ లెను. అందు గ్రంథనామము గ్రంథకర్తనామము లుండవలయును. ఆకా ర్డుపైని చదువరి స్వయముగా తనచిరునామాను వ్రాయవలెను. వలయు గ్రంథము గ్రంథాలయమున చేరగనే పాలకుడు సంతక ము జేసి ఆ కార్డును బంట్రోతుద్వారాగాని, పోస్టుద్వారాగాని చదువరికి పంపును, పోస్టుద్వారా పంపవలసియున్నపుడు చదువరి అర్ధణాబిళ్ళ అంటింపవలెను. రిజర్వు చేసిన గ్రంథమును రిజస్టరుపై నమోదు చేయ వలెను. “పెద్ద గ్రంథాలయములలో గ్రంథమును వెతకి పట్టుకొనుట చాలకష్టము. అందువలన రిజర్వు చేయుట బహుప్రయాసతో కూడి యుండును. కనుపడని పొత్తముకొరకై రిజర్వు కార్డు యుంచుటవలన పాలకునిశక్తి కాలము వృధాయైపోవును. దొరుకని పొత్తముకొరకు