Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

గ్రంథముల గడువు-దాచియుంచుట, 93 మననము చేసికొనవలసిన యావశ్యక ముగలదు. అందువలన అన్ని తర గతుల గ్రంథములకును ఒకేకాల నియమము సరికాదు. ఒక్కొక్క తరగతి గ్రంథములకు ఒక్కొక కాలనియమము చేయవలసివచ్చును. ఒక నవలను చదువుటకు వారముదినములు సరిపోవును. ఒక వేదాంతగ్రంథ మును జదువుటకు వారముదినములు బహుస్వల్పము. ప్రత్యేక తరగతికి ప్రత్యేక కాలమును నిర్ణ యించుట కువీలు లేనియెడల సాధారణముగ గ్రంథ ములన్నిటికి ఎంత యెక్కువకాలము కావలెనో ఆగడువును యేర్పరుప వలెను; కనుక పదిహేను దినములు గడువు బా, సగ నుండును. ఒకే గ్రంథము తిరిగి కావలసినయెడల యిచ్చుటకు నిబంధన లుండవలెను. గ్రంథమును రెండవమారు యిచ్చునపుడు, ఆగ్రంథమునకు పది హేను దినముల కన్న యెక్కుడుకాల మవసర మగునో కాదో పాలకుడు గమ నింపవలెను. అట్టి గ్రంథము కొరకు యింకొక దరఖాస్తు నిలువలో నున్నను దానిని వెనుకటివానికే యివ్వవలెను. అట్లు చేయనియెడల వెనుకటి వానికి గానిముందు వానికిగానియుపక రింపజాలదు,అట్టిగ్రంథమును తొందరగా జాలమంది చదువుటకన్న సావకాశముగా కొలదిమంది చదు వుటయేలాభము, గడువుదినములలో పూర్తియగు గ్రంథ వ ను కొత్త దరఖాస్తు లేకయున్నను తిరిగి యివ్వకూడదు. బహు అరుదుగా నివ్వవచ్చును. చదువరులు గ్రంథము నుంచుకొనుటకు పదిహేనుదినముల గడు వును యేర్పర చెద మనుకొందము. ఒకరు గ్రంథమును ఫిబ్రవరి 21 తేదీని తీసికొనినయెడల తిరిగి మార్చి 8 తేదీనాడు యిచ్చి వేయవలెను. ఆ దినమున గ్రంథము తిరిగి రానియెడల 3 దినములు క్షమింపవచ్చును. ఆదినములలో బుక్కు కార్డును వేరుగా నుంచవలెను. క్షమాదినములను యేర్పరుచుట గ్రంథాలయ సంఘమునకును చదువఁకిని తారకము. క్షమాదినములలో చదువరి గ్రంథమును పూర్తి చేసి యిచ్చి వేయ వచ్చును గడువుదినములలో చదువరిగ ంథ మునుపూర్తిచేసియు కొన్ని యడ్డంకులచేత గ్రంథమును యిచ్చి వేయుటకు వీలుండక పోవచ్చును. అట్టి చదువరిని శిక్షించుటన్యాయముకాదు. కనుక గ్రంథమును మార్చి 10 తేదీ i