6. హుగ్లీ జిల్లా గ్రంథాలయ సంఘమునకు చేసిన గ్రంథాలయము లన్నియు, అవసరమైనప్పుడు పరస్పరము గ్రంథములను ఎరువిచ్చుకొనవలసిన దనికోరుచున్నారు.
7. ప్రతి గ్రంథాలయము కొందరు దేశ సేవకులను తయారు చేయవలసిన దనియు, పండితుడుగాని గ్రంథకర్తగాని కోరినప్పుడు గ్రంథములను ఉచితముగా ఎరువిచ్చుట మూలముగాను ఇతర విధము గాను సహాయము చేయవలసిన దనియు ఈసభవారు తీర్మానించు చున్నారు.
8. హుగ్లీ జిల్లా యొక్క చారిత్రాత్మకమైనట్టియు, ఇతర విధమైనట్టియు చరిత్రను సమకూర్చవలసినదని గ్రంథాలయములను ఈసభవారు హెచ్చరించుచున్నారు.
9. గ్రథ భాండాగారికు లందరికిని కలిపి ఒక సంఘమును ఏర్పరచుటకును, అట్టి సంఘమును నిర్మించుటకు త్వరలో జిల్లాయందున్న గ్రంథ భాండాగారికు లందరిని ఒకచో జేర్చి, గ్రంథాలయ పాలనమునుగూర్చియు, విద్యార్థులందు సహకారమును గూర్చియు, గ్రంథ భాండాగారికులయందు సహకారమును గూర్చియు, గ్రంథాలయముల అభివృద్ధిని గూర్చియు చర్చించుటకు తీర్మానించడమైనది.
గ్రంథములగడువు — దాచియుంచుట
(యాతగిరి లక్ష్మీ వేంకటరమణగారు)
చిన్న గ్రంథాలయమునకును పెద్దవానికిని గూడ చదువరులు గ్రంథమును తమవద్ద నుంచుకొనగల గడువు దినముల గరిష్ఠ సంఖ్య యేర్ప రుప వలసిన యావశ్యకతకలదు. ఈగడువు దినములు చదువరుల యొక్క యు, గ్రంథములయొక్క యు స్వభావమునుబట్టి నిర్ణయింప దగును. కొన్ని పొత్తములు మంచినీళ్ళ ప్రాయముగా చదువగలరు. మరికొన్ని చిన్ని పొత్తము లైనను జాగ్రతగా చదివి విషయములను