20
క్రీస్తుశకము 172 సంవత్సరములో సింహాసన మెక్కిన "హాను” వంశపు చక్రవర్తి “లిస్ట్”యను నాయన. ఆయన పద్యవాఙ్మయము చరిత్ర, ఖగోళశాస్త్రము, కర్మశాస్త్రము, కాలశాస్త్రములను గూర్చిన గ్రంథములను శిలామయ విజ్ఞాననిధియందు చిత్రింపజేసెను. ఈ వాఙ్మయమునంతను కాగితములపై ఎత్తవలెనన్న 6000 పెద్దటావుల కాగితము పట్టును.
“పికీను” రాజధానియందు రాజపుత్రులకు విద్యాభివృద్ధి చేయుటకై స్థాపింపబడిన శిలాశాసనపు విజ్ఞాననిధి యొకటి యున్నది. ఇందు సంవత్సరమున కొకతూరి చక్రవర్తి ఉపన్యాసమును వినుటకు వెళ్లును. అచ్చట రాజధర్మములను గూర్చిన సద్బోధను వినును. తద్వ్యతిరేకముగ ప్రవర్తించినందుకు మందలింపును పొందును. మరియు శిలాశాసన విజ్ఞాననిధియందు చక్రవర్తి చీనా దేశముయొక్క విజ్ఞానమును గూర్చి ధ్యానముచేసి ప్రజలను పరిపాలించుటకు కావలసిన పరిజ్ఞానము నొసంగుటకు వరమును ప్రార్థించును. చీనా దేశమున
"చూపూ” రాష్ట్రమందలి షాంటింగు పట్టణమున ఇట్టి ప్రతిష్టాపనయే మరియొకటి యున్నది. ఇచ్చటనే చీనా దేశమత ప్రవక్తయగు “కనుప్యూషియసు” యొక్క సమాధియున్నది. ఇప్పు డీమండలమును పాలించుచున్నది ఈసంయమీంద్రుని వంశీకుడే. చీనా దేశమున కంతకు సుప్రసిద్ధి వహించిన “కనుప్యూషియసుయొక్క" పూజకొరకై నిర్మింపబడిన దేవళ మిచ్చటనున్నది. ఇందు ఈమునిపుంగవుని ధర్మములు శిలలపై లిఖింపబడియు చిత్రింపబడియు నున్నవి.
ఇంత యద్భుతములగు ప్రతిష్ఠాపనలు మనుజునకు ఎల్లకాలములయందు కూడ ఆశ్చర్యమును భక్తిని జనింపచేయకుండవుగదా?