19
చీనా దేశ శిలామయ విజ్ఞాన నిధులు
దహనము చేయవలసిన దని శాసించుఁడు. ప్రాచీన చరిత్రలును, సనాతన ధర్మములును లేనిచో, తమ రాజ్యపరిపాలనను ఈపండితాధములు అసహ్యముగా నుండునట్లు పూర్వపు రాజుల పరిపాలనతో పోల్చి చెప్పరు.
మీ మత గురువులతోనే ప్రారంభింపుడు, వారు చరిత్రవిజ్ఞానముతో నిండి యున్నవారు, అనాదినుండి సంరక్షింప బడుచున్న విజ్ఞాననిధులను భస్మీపటలము చేయుమని వారల కాజ్ఞాపింపుడు. ధర్మశాస్త్రములను సంరక్షించు న్యాయాధికారులకుకూడ ఇట్లే యాజ్ఞ యొసంగుడు. కావ్యములనుకూడ ఇట్లే చేయుడు. ఇవియన్నియు విస్మరణీయములు. వీని నన్నిటిని దగుల బెట్టుడు.
విశ్వసించుటకు వీలు లేని ఈదుర్మార్గమునకు రా జంగీకరించి నిశ్చయముగా కార్యరూపము నొందించుటకే కృతనిశ్చయుఁ డాయెను. గ్రంథములను సేకరించి కాపాడుచున్న వారందరు 30 దినములలోగా రాజభటులకు వానిని స్వాధీనపర్చ వలసినదనియు లేనిచో మరణశిక్ష విధింపబడు ననియు రా జొకశాసనమును ప్రకటించెను. ఈదుష్కార్యమునకొడిగట్టని 460 మంది వజ్రసంకల్పులగు పండితులు వారి గ్రంథములతో కూడ ఒక అగాధము నందు త్రోయబడి పూడ్చబడిరి. రాజ్యమందంతటను “హాహా” కారము పుట్టెను. కొన్ని వత్సరములు గడచిన పిదప “త్సిను” వంశము తుద ముట్టినది. అటుపిమ్మట రాజ్యము నధిష్ఠించిన “హ్యూ” చక్రవర్తి ఉద్గ్రంథములను చదువకూడదను శాసనమును రద్దుపరచి, ఇంత కాలమునుండి నిక్షిప్తము చేసిన గ్రంథరాజముల నన్నిటిని సేకరించుటకు ఆజ్ఞ నొసంగెను. మరియు వెనుకటి దుర్మార్గ చక్రవర్తివలె ఎవ్వరును ఎప్పటికినికూడ అవినీతిమార్గముల ప్రవర్తించ కుండ భద్రము చేయుటకుగాను గ్రంథములను శిలాశాసన బద్ధముగ చేయునట్లు యాజ్ఞ చేసెను, ఇది చీనా దేశముయొక్క శిలాశాసన వాఙ్మయముయొక్క ఉత్పత్తి.
పిమ్మట ఎనమండుగురు చక్రవర్తులు తమ తమ పరిపాలనలయందు ఈవిజ్ఞానధనమును వృద్ధిపరచిరి. ఇట్లు వృద్ధిపరచినవారిలో మొదటివాఁడు