18
మంత్రి యుండెను. ప్రజలలో విజ్ఞానము వ్యాపించకుండ నాశనము చేసినచో పజలను ఎల్ల కొలమును పరిపాలన చేయవచ్చు నని ఈమంత్రి తన చక్రవర్తికి సలహా నిచ్చెను.
శ్రీస్తుశకమునకు పూర్వము 213 సం॥రం॥లో ఈకథ జరిగినది. చక్రవర్తికి ఈమంత్రి ఒక విన్నపమును నివేదించెను. అది ఇట్లున్నది.
“ఓ రాజచంద్రమా! ప్రపంచ మంతటను ప్రకాశించుచున్న మీ యశః కాంతిచేతను, నద్వితీయ మగు మేధాశక్తిచేతను పూర్వపు చక్రవర్తులకంటె తీసిపోని వి స్తీర్ణముగల రాజ్యమును మీరు జయించి పరిపాలించుచున్నారు, మీఔన్నత్యమును శాశ్వతముగా చేసికొనవలెనన్న మీ దృష్టిని పండితుల వైపుకు తిప్పవలెను. వీరివలన మిక్కిలి ప్రమాదములు కలుగును. వారి ఉద్దేశములను నేను జాగరూకతతో గమనించు చున్నాను. వారి అతఃకరణయందలి భావములనుబట్టి వారు మీకు శాశ్వత శత్రువులు. ఇంతకంటే వివరముగా నేను చెప్పలేను. తాము శాసనములను వేనినైనను జారీచేసిన వెంటనే అందు ఏదో యొక అన్యాయమునుగాని, అధమము నిరర్థకత్వమును గాని కనిపెట్టెదరు. పూర్వకాలపు న్యాయపరిపాలకులగు రాజుల కాలను నాటి శాసనములను తమశాసనములనుపోల్చి తమయందు న్యూనతను నిరూపించెదరు. సర్వదా ఇట్లు చేయుచుండుటచే ప్రజలయందు రాజద్రోహము రాను రానువృద్ధియై తిరుగబాటు చేయుటకు ఉద్రేక మేర్పడును. ఇట్టిసందర్భమునందు కర్తవ్యమును సూచించెదను, మృదుత్వమువలన పరిస్థితులు బాగుపడవు. ఈ ఉపద్రవమును వెంటనే నిర్మూలము జేయవలసి యున్నది. గ్రంథముల వలన నేకదా ఈపండితులయందు ఇట్టి యాశయము లుండుటకు కారణమైనది కావున గారివద్దనుండి ఆపుస్తకములను లాగికొండము. శాశ్వతముగా ఈగ్రంథములను నష్టపరచినచో ఈపండితులయొక్క ప్రతిదినము వృద్ధి నొందుచున్న పొగరుబోతుతనమును, అంతులేని మొండి తనమును నశించును. వైద్య శాస్త్రమును వ్యవసాయశాస్త్రమును, జ్యోతిషమును, తమయశశ్చంద్రికలను వెదజల్లు గ్రంథములను మాత్రము ఉంచి మిగిలిన గ్రంథములన్నియు నిరర్థక మైనవగుటచే