ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గ్రంథములు
(ఆచంట సూర్యనారాయణ సాంఖ్యాయనశర్మగారు)
సీ.మంచి మందంచును♦సంచిలో నుంచిన
రోగంబు మాన్పి యా♦రోగ్య మిడునె?
ఫలము మంచి దటంచు ♦వర్తించి తినకుండ
దాఁచినచో జిహ్వ ♦ తనియఁగలదె?
చల్లదనంబిచ్చు♦ చందనం బనిచెప్పి
పూయక సుఖమెట్లు ♦పొందఁ గలఁడు?
భాగ్యంబు గలదంచు వాడకయుండిన
భాగ్య సౌఖ్యము వాఁడు వడయు నెట్లు?
జ్ఞానదాయక గ్రంథముల్♦ చాలదెచ్చి
బీరువాలను నిండించి పెట్టునంత
జ్ఞానభాగ్యంబు గలుగదు♦ చదువకున్న
ఇంటిలో విత్తులుంచఁ జే ♦ నెట్లు పండు?
చీనా దేశ శిలామయ విజ్ఞాన నిధులు
చీనా దేశమందల శిలామయ గ్రంథాలయములయొక్క చరిత్ర చాల ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వము 3 వ శతాబ్దమున “ట్సెన్ షిహి హ్యాంగు” అను చక్రవర్తి ఆదేశమును పరిపాలించెను. ఈతను ప్రజలను వీడించుటయందు ప్రపంచమందంతటను నద్వితీయుఁడు. ఆతనికి లిస్స్జియను