బడెను, ధర్మములకొరకు ప్రత్యేకింపబడు నూటికి రు 20 లవంతున సొమ్మును గ్రంథాలయముల కొసంగవలసినదని సహకార సంఘములను ప్రార్థించిరి. పాఠశాలలుండియు గ్రంథాలయములు లేని 574 బరోడా గ్రామములందు గ్రంథాలయములను స్థాపింపవలెననిరి. ఇంగ్లాండు నందలి నేషనల్ హెూంరీడింగు యూనియన్ వారి మార్గముల ననుసరించి ఈడు ముదిరిన వారికి చదువుకొను మార్గములను సూచింపవలెననిరి. గుజరాతీ భాషయందు ప్రకటింపబడిన 2000 నవలల నుండి ఏర్చిన పట్టిక నొకదానిని ప్రకటింపవలెననిరి. కతియవారు సంస్థానము వారు గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయ ప్రోత్సహించుట కొక ఉపసంఘ మేర్పడెసు. కేంద్ర గ్రంధాలయమందు గుజరాతీ భాషాగ్రంథముల నభివృద్ధిపరుపవలెననిరి.
రాబోవు సభ పటాన్ గ్రంథాలయము వారి ఆదరణకింద జరుగును. భావనగర సంస్థానము వారు ఇద్దరు యువకులను గ్రంథాలయ
శాస్త్రమును నేర్చుకొనుటకై బరోడా కేంద్ర గ్రంథాలయమునకు బంపుచున్నారు.
గ్రంథాలయోద్యమము
(కొణకంచి శ్రీరామచంద్ర బాలభక్త గ్రంథ వార్షికోత్సవ సమయమున శ్రీ జయంతిపురం రాజాగారిచే నియ్యబడినది)
ఈ గ్రంథాలయను యొక్క ఆర్థికస్థితి చక్కగాలేదను విషయము కొంత విచారదాయక మయినను, కార్య నిర్వాహకవర్గము వారి పట్టుదల వలన నిప్పటికి పదమూడు వత్సరములనుండి నిరంతరాయముగా నడుపుచున్నందు కెంతయును సంతసించుచున్నాను. ఈ తాలూకాకు ముఖ్యస్థానములనదగు నందిగామ, జగ్గయ్య పేటలలో గూడ నీయుద్యమము నందీవిధమగు పట్టుదల గానవచ్చుట లేదు. వత్స