గదిని స్థాపించువిషయము పుస్తకాలయపత్రిక యందు ప్రకటింపబడినది. కాని కొద్ది గ్రామములవారు మాత్రము, దాని సదుపాయమును పొందిరి. సంస్థానమునందుగల 42 గ్రామములలో 6 తాలూకాల యందు గ్రంథాలయ సంఘములు ఇదివరకే గలవు. ఇప్పుడు 5 కొత్త తాలూకా సంఘములు ఏర్పడినవి. రాజుగారి సహాయమును పొందుచున్నవి. 706 గ్రంధాలయములు గలవు. వానియందు 472906 గ్రంథములు గలవు. వానిని 294,237 మంది చదివిరి. ఇవిగాక 172 పఠనమందిరములు గలవు. రాజుగారు వీనికై రు 95,000 ల నిచ్చెదరు. ఇదేమొత్తమును లోకులు బోర్డులు ఇచ్చెదరు. ఇంకొక అంతమొత్తమును గ్రంధాలయములవారు ఖర్చు పెట్టెదరు. ఈ గ్రామ గ్రంథాలయములు గాక బరోడా పట్టణ మందొక కేంద్ర గ్రంథాలయముగలదు. అందు 87,000 గ్రంథములు గలవు. గత సంవత్సరమున 97,086 మంది చదివిరి. కేంద్ర గ్రంథాలయముయొక్క సంచార శాఖ యందు 17,426 గ్రంథములు గలవు. అందు 11,864 గ్రంథములు 862 సంచార పేటికలయందుంచి 180 గ్రామములకు బంపిరి. వానిని 4,982 మంది చదివిరి.
గ్రంథాలయములకు చవుక ధరలకు పుస్తకములను పత్రికలను సప్లయి చేయుటకును, గుజరాతీ భాషయందు పుస్తకాలయ పత్రికను ప్రకటించుటకును "లైబరీల కోఆపరేటివు సప్లయి సొసైటీ" పెట్టబడి బాగుగ పనిచేయుచున్నది. సహాయ గ్రంథాలయ శాఖాధికారి తన సంచారములందు ఉపన్యాసముల నిచ్చుటయేగాక గ్రంథ భాండాగారకులకు బోధనాతరగతులను గూడ నడపిరి.
గ్రంథ భాండాగారి విధులు, స్త్రీలకు ప్రత్యేక గ్రంధాలయములు, స్త్రీలు - గ్రంథాలయములు అను విషయములను గూర్చి, ప్రభు దేశాయి అనునామెయు మరియిద్దరు స్త్రీలును ఉపన్యాసముల నిచ్చిరి.
తీర్మానములు
అప్పుడు ఈ క్రిందితీ ర్మానములు అంగీకృతములాయెను. గ్రంథాలయోద్యమమును పోషించుటకై గైక్వారు గారికి వందనము లర్పింప