నట్టియు ప్రజలు - ఇవియే బరోడాయందు గ్రంథాలయోద్యమమును జయప్రదము జేసినవి. అంతటితో నాటి సభ ముగిసెను.
కార్యనిర్వాహక సంఘము
29 వ తేదీన కార్యనిర్వాహక సంఘము వారి నివేదికను జదుపుటతో సభ ప్రారంభమాయెను. గత నభ యందు తీర్మానింపబడిన ప్రకారము “గ్రంథాలయ దినము” నొకదానిని ఏర్పరచి, ఆదినమున బరోడా రాజ్యము నందంతటను గ్రంథాలయములు ఉపయోగమును గురించి ఉపన్యాసములు నిప్పించుటయును, గ్రంథములకై ద్రవ్యమును వసూలు జేయుటయును జరిగెను. జనులందరికి బాగుగా తెలియనప్పటికిని, ఫలితములు మిక్కిలి సంతృప్తికరముగా నున్నవి. జిల్లాపట్టణముల యందు అదివరకే రాజు గారియొద్దనుండి సహాయమును పొందుచున్న సార్వజనిక గ్రంథాలయములున్నప్పటికిని, స్త్రీలకు బాలురకు ప్రత్యేక గ్రంథాలయములను గూడ స్థాపించుకొనుటకు బరోడా రాజుగారు అంగీకరించిరి. గుజరాతు, కలియవారు దేశములలో గల గ్రంథాలయముల చరిత్రనుగూడ ప్రకటించిరి. ఇతర ప్రాంతములందు అనగా మద్రాసు, బర్మా, బెంగాలు, ఆఫ్రికా లందుగల గుజరాతు గ్రంథాలయముల చరిత్రగూడ అందుగలదు —
8000 గ్రంథములు గల గుజరాతు భాషా గ్రంథముల పట్టిక గూడ ప్రకటింపబడినది. దానిఖరీదు రు 7 లు, అది అమెరికాదేశ గ్రంథాలయ సంఘము యొక్క పద్ధతుల ననుసరించి, గ్రంథకర్త, గ్రంథము పేరు, ప్రచురణకర్త, ఖరీదులను దెలుపుచు, గ్రంథకర్త పేరు, గ్రంథము పేరు, విషయముపేరుల ననుసరించి వర్గీకరింప బడినది.
ఈగ్రంథమునకు అనుబంధముగా గుజరాతీ గ్రంథముల వర్గీకరణ పద్ధతికూడ ప్రచురింపబడినది. అందు “కట్టరు” పద్ధతిని తయారు చేయబడిన గ్రంథకర్తల నామముల అకారాది పట్టిక గూడ గలదు, దీని ఖరీదు రు 1-0-0.
క్రిందటిసభలలో తీర్మానింపబడిన ప్రకారము ప్రయిమరీ పాఠశాలలుగల గ్రామములలో వానియందు గ్రంథాలయమున కొక