అభివృద్ధికి మార్గదర్శకులలో గొప్పవారు బరోడా గైక్వారుగారు. అట్టి మహనీయునితో స్నేహముజేయు భాగ్యము ఆయనకు అబ్బినది. పాశ్చాత్య దేశములయందలి ఏ గొప్ప రాజకీయధురంధరునితో గాని, పరిపాలకునితోగాని, సంస్ధర్తతోగాని పోల్చదగినవాడీ బరోడా మహారాజు ఒక్కడే. రాజ్యము రాజుకొరకుగాదు, రాజ్యమునందలి ప్రజల కొరకు - ఈ కారణము చేతనే బరోడా రాజుగారు విద్యావిషయము నందును సార్వజనిక గ్రంథాలయముల విషయమునను యీ దేశము నందు మార్గదర్శిగా వెలయుచున్నాడు. ఇతర సంస్థానములందలి విద్యాధికారులు అనేకమంది విచ్చేసినందుల కెంతయు సంతోషముగ నున్నది. ఇక్కడ చూచినట్టియు విన్నట్టియు సంగతులను వారు తమ అధీశులతో జెప్పి వారిసంస్థానములందు గూడ ప్రజల ఉపయోగార్ధము ధర్మగ్రంథాలయములను స్థాపించునటుల చేయుదురని కోరు చున్నాను. భావనగర సంస్థానమునందు నా శాయశక్తుల పనిజేసెదను. వారి సంస్థానమునందు ఒక భవనమునందు మంచి గ్రంథాలయమే పెట్టబడినది. కాని బరోడాయందున్నంత ఉత్సాహము లేదు. అనేక సంవత్సరములనుంచి పని జేయుచున్న ఉద్యమాభిమానుల యొక్క మొక్కవోవని దీక్షయే బరోడా గ్రంథాలయోద్యమము యొక్కయు, ఈ సభ యొక్కయు జయప్రదమునకు కారణము. చలనరహితమైన వట్టి తెలివి తేటల వలన మాత్రము సంస్కారములు ఆచరణలోనికి రావు; తెలివి తేటలుగలిగిన మనుజుని యొక్క ఉత్సాహాగ్ని వలనను, వారికి ఉద్యమమందుగల లగ్నత వలనను మాత్రమే అవి ఆచరణకు వచ్చును. అట్టి గ్రంథాల యభావుకులను ముగ్గురిని ఈనాడు కలుసుకొంటిని. వారికి జన్మ యొక్క పరమార్థము గ్రంధాలయతత్వమును వ్యాపింపజేయుటయే. వారు బరోడా గ్రంథాలయ శాఖాధికారియును, సహాయ శాఖాధికారియును బాల శాఖాధికారియును. వారుగాక వృత్తిచే వ్యాపారస్థుడైనను, ఇట్టి గ్రంధాలయ భావుకులలో ప్రతాపరాయ్ మెహతా గారిని గూడ చేర్చదగును. ఉపకార బుద్ధి గలిగిన ప్రభుత్వము - తమ ధర్మమును గుర్తెరిగిన ఉద్యోగులు - కృతజ్ఞులును తెలివి తేటలు గలిగి
పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/5
స్వరూపం