Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థానమువారును సౌరాష్ట్ర నవజీవను కార్యస్థానముల వారును గ్రంథములను ప్రదర్శించిరి. లిఖితపత్రికకు ఒక బహుమతి నిచ్చెదమని ప్రకటింపగా, 65 సచిత్ర లిఖితపత్రికలు ప్రదర్శింపబడెను. ఇప్పుడు ప్రచారములో లేని పాత గుజరాతీ పత్రికలు నూరు సంవత్సరముల క్రిందట ప్రారంభిపబడిన ఒక పత్రికగలదు. ఈకాల ప్రారంభిపబడిన ఒక పత్రిక కలదు. ఈ కాలమునందు ప్రకాశితమగు ఆంగ్లేయ గుజరాతీ భాషాపత్రికలు ప్రదర్శింపబడెను. బరోడా రాజ్యమందలి గ్రంథాలయోద్యమము విపులముగా విశదీకరింపబడిన అచ్చు గ్రంధమును గూడ ప్రదర్శించిరి.

28 వ తేదీ ఉదయమంతయు ప్రదర్శనమును జూచుటతో సరిపోయినది. మధ్యాహ్నము ఆహ్వాన సంఘాధ్యక్షులగు రాజా రత్నహరిలాలు గారి ఉపన్యాసములో సభ ప్రారంభమాయెను. కతియవారు ద్వీపము ఐశ్వర్యసంపన్నులగు రాజులతోను, రాజ్యాంగ వేత్తలతోను, వర్తకులతోను తులతూగుచున్నను ఒక విశ్వవిద్యాలయమునుగాని, కార్మిక విద్యలను నేర్పు పాఠశాలగాని, తుదకు ఒక మంచి గ్రంథాలయముగాని లేదని విచారించుచు అట్టివాని నొసంగగల కార్నీజీవంటి మహాశయుడు ఎప్పుడు తమ రాష్ట్రమందు ఉద్భవము కాగలడోయని వాపోయిరి. తమునందు

అధ్యక్షుని ఉపన్యాసము

పిమ్మటఅధ్యక్షులు తమయాసనము నలంకరించి, తన దీర్ఘజీవితము నందు గ్రంథ సమీకరణము నందును గ్రంథపఠనము నందును అమిత యాసక్తి గలవాడననియును ప్రపంచమునందున్న అనేక గ్రంథాలయములను జూచితిననియు వచించిరి. ఈసభకు అధ్యక్షత వహింప వలెనని తన్ను కోరినప్పుడు తాను గ్రంథాలయములను గూర్చి నేర్చుకోవలసిన దేమియు లేదని తలంచితిననియు, కాని ఆ యుదయము గ్రంథాలయ ప్రదర్శనమును జూచినప్పుడు గ్రంథాలయముల యొక్క మంచి ఉద్దేశములను, జనసామాన్యాభివృద్ధికై అవి చేయదగిన అనంతములగు మార్గములను గూర్చియు తెలిసికొంటిననియు జెప్పిరి. హిందూదేశము అన్ని దశలయందును అభివృద్ధిని బొందుచున్నది. అట్టి