బరోడా రాష్ట్ర గ్రంథాలయసభ
నాల్గవ బరోడా రాష్ట్ర గ్రంథాలయమహాసభ 1929 సం॥ రము మార్చినెల 28-29 తేదులయందు అమరేలి పట్టణమందు సర్ ప్రభా శంకర దల్ పత్ రామ్ పట్టాణీగారి అధ్యక్షత క్రింద జరిగినది. బరోడా రాజ్యమందున్న 250 గ్రంథాలయములనుండి ప్రతినిధులేతెంచిరి. అమరేలి పట్టణమందున గ్రంథాలయమువారు ప్రతినిధులకు కావలసిన ఏర్పాటులనన్నిటిని జయప్రదముగా గావించిరి.
ఈసభతో బాటు గ్రంథాలయ ప్రదర్శనమునుగూడ జరిపిరి. బరోడా రాజ్యముయొక్క గ్రంథాలయ శాఖయును, బరోడా గ్రంథాలయముల సహకార సంఘమును, మాక్మిల్లను కంపెనీవారును, వాకరు గ్రంథాలయమువారును ప్రదర్శనమునందు అమూల్యవస్తుపులను ప్రదర్శించిరి. బరోడా రాజ్యమందున్న 706 గ్రామ గ్రంథాలయములును, అచటి సంచార గ్రంథాలయములును, బాల శాఖయును ఎటుల పని చేయుచున్నవో జూపిరి. ఇవిగాక ఇంగ్లీషు, గుజరాతి, మహారాష్ట్ర భాషలయందు “పోష్టరు” లనుగూడ ప్రదర్శించిరి. ఒక చోట 1928 సంవత్సరమునందు గుజరాతీ భాషయందు ప్రకటింపబడిన గ్రంథముల నన్నిటిని ప్రదర్శించిరి. పాశ్చాత్య దేశములందున్న సుప్రసిద్ధ గ్రంథ ప్రకాశకులందరును మాదిరీలను బంపిరి. ఇంకను మద్రాసునందున్న గనేశను, గననాశను కంపెనీలును, అహమ్మదాబాదు నందున్న ఛీఫ్ లిటరేచరు సొసైటీ వారును, భావనగరమందున్నదక్షిణామూర్తివారును, అహమ్మదాబాదులయందున్న కుమార కార్య