మిడిరి. అప్పటినుండియు శ్రీ సహకార శారదా విద్యానిలయ పుస్తక భాండాగారమను పేరు నెలకొల్పబడినది.
ఈ గ్రంథాలయమందు 321 గ్రంథములు గలవు. గ్రంథాలయమునకు వచ్చు పాఠకుల సంఖ్య నెలకు 300 మంది. ఇండ్లకు తీసికొని పోవువారి సంఖ్య 123 మంది. 3 గురు చందాదారులవల్ల రు 95 లు వసూలగుచున్నది. ఇతర గ్రంథాలయములవలె పుస్తకములు చందాదార్లుగాని వారికి యిండ్లకు యిచ్చుపద్ధతి యీ గ్రంథాలయమున లేదు. జనసామాన్యమునకు గ్రంథములను చదువుట కవకాశము యెక్కువగా కలుగజేయుటకై చందాదార్లు కానివారికి గ్రంథములు స్త్రీలకు, పురుషులకు యిండ్లకు యిచ్చునట్లు యీ సభలో తీర్మానించ బడవలయును. ఈ వత్సరము ఆదాయము రు 163-7-9 లు; వ్యయము రు 153-14-0 లు—– 7 పత్రికలు వచ్చుచున్నవి.
ఈ గ్రంథాలయము గూడూరు తాలూకా గ్రామాదులలోని ప్రజలకు మార్గదర్శియైయున్నది శ్రీగూడూరు వెంకటసుబ్బారెడ్డిగారు యీ భాండాగారమునకు ప్రథమమున తమ యొద్దనున్న భారతాది గ్రంథము లన్నిటి నిచ్చి బాగుపరచుటకు కంకణముగట్టి పెక్కు విధముల తోడ్పడుచు పురోవృద్ధి కొరకు పాటుపడుచు యీ స్థితికి తెచ్చి నందులకు గ్రంథాలయము వారందరు కృతజ్ఞతా పూర్వకమైన వందనము లర్పించుచున్నారు. వీరు అచిర కాలములోనే భవననిర్మాణము చేయగలందులకు సభ్యులందరు యేకగ్రీవముగా ప్ర్రార్థించుచున్నారు. ఈ గ్రామసంఘమువారు వార్షికపు చందా రు 25 లు ఇచ్చునట్లు ఒప్పుకొన్నందుకు మా సంఘమువారు వారికి వందనము లర్పించు చున్నాము. జిల్లాబోర్డు మెంబరుగారైన పెల్లేటి వీరాఘవ రెడ్డి గారు రు 25 లు విలువగల అద్దములు బీరువాను ఇచ్చిరి. ఇంకను పలువురు గ్రంధములను సహాయము జేసిరి. వారందరికిని వందనములు.
- షేకు చినిగీషాసాహేబు, కార్యదర్శి