చుట్టుపక్కల గ్రామాదులనుండి 400 మంది విచ్చేసిరి, బాలభటులు సభయందు ఏర్పాటులనన్నింటిని వినయముతో జూచుచుండిరి. ప్రారంభమున సరస్వతీపూజ జరిగినది. తదుపరి ప్రార్థనజరిగిన పిమ్మట అధ్యక్షులకు వినతిపత్రము సమర్పించిరి, కొణకంచి వెంకటేశ్వర రావుగారు సాంవత్సరికరిపోర్టును చదివిరి. పిదప గ్రంథాలయము వలని లాభములను గూర్చియును గ్రంథాలయపు పూర్వచరిత్రములను గూర్చియును కొణకంచి చక్రధర రావుగారును, రైతులందరును సమావేశమగుటవలన “రి సెటిల్ మెంటును” గూర్చి పురుషోత్తమరావు గారును, నిమ్నజాతి యుద్ధరణము - గ్రామ పారిశుద్ధ్యమును గూర్చి కాకుమాను పిచ్చయ్యచౌదరిగారును, ఖద్దరును గూర్చి సుంకర నరసింహంగారును, గ్రంథాలయోద్యమమును గూర్చి కంచుకచర్ల కర్ణం గారగు పింగళి ఆంజనేయులు గారును, తాగుడును గూర్చి రేపాల బుచ్చి రామశేషయ్య శ్రేష్ఠి గారును, గ్రంథాలయములెట్లు పనిచేయవలయును అను విషయమున తమకు గల యనుభవమును బట్టి గ్రంథాలయాధ్యక్షుడగు రేపాల శేషయ్య శ్రేష్ఠి గారును, బాల భటోద్యమమును గూర్చి బాలభటనాయకుడగు లావు వెంక టేశ్వర రావు చౌదరిగారును, స్త్రీవిద్యను గూర్చి శ్రీమతి కోణకంచి సరస్వతీ బాయమ్మ గారును ఉపన్యసించిరి. శ్రీ రాజా గారి యుపన్యాసముతో సభ ముగిసెను.
ఈశ్వర పుస్తక భాండాగారము, కాకినాడ
ది 1–4–28 లగాయితు 31-8-1929 తేదీతో అంత్యమగు సంవత్సరమున పరిపాలన నివేదిక:-
ఇందు 105 మంది పురుషులును, 28 మంది స్త్రీలును సభ్యులుగా గలరు. కార్యనిర్వాహణమునకై గత సంవత్సరమున జరుపబడిన 3 సభలకు బదులు యీ సంవత్సరములో 5 సభలు గావింపబడెను. ఒక సాధారణ సంఘసభ జరుపబడెను. '