Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(మాడగుల), అల్లం శెట్టి అప్పయ్య (పొందూరు), ఉమార్ ఆలీషా (పిఠాపురం), శ్రీకవిరాజ వత్సవాయి వెంకటనీలాద్రి రాజు(తుని), శివుడు శివరావు (కొవ్వూరు), శనివారపు సుబ్బారావు(నిడదవోలు), అయ్యంకి వెంకటరమణయ్య (బెజవాడ), సూరి వెంకట నరసింహశాస్త్రి, నడింపల్లి, వేంకటలక్ష్మీనరసింహారావు (గుంటూరు), బెల్లంకొండ రాఘవరావు, మూగంటి బాపినీడు, పొనకా పట్టాభిరామ రెడ్డి, గుర్రం సుబ్బ రామయ్య, అల్లూరి వెంకటసీతమ్మ (అంగలూరు), అంధవరపు లక్ష్మణమూర్తి (హీర మండలం), తూలు పాటి సన్యాసమ్మ (గొల్డాం), పోలిశెట్టి అది నారాయణగు ప్తగార్లు (గుంటూరు).

10. సంఘకార్యాలయము బారువలో నుండుటకు తీర్మానించడమైనది.

11. రాబోవుసభ తునిలో జరుపుటకు అధ్యక్షులచే నాహ్వానింపబడినది.

అధ్యక్షులకు, స్వచ్ఛంద సేవకులకు సభ్యులతరఫున కొన వేంకటరాయ శర్మగారు వందనము లర్పించిరి.





రాయలసీమయందలి గ్రంథాలయములు

నేను కర్నూలుపురము ప్రవేశించినతోడనే యీయూర నొక భాషానిలయ మాంధ్ర గ్రంథాలయమను పేరున జక్కని స్థితిలోనున్నదని యెఱిగి నిన్నటిరాత్రి 7 గంటల వేళ దానిజూడబోయితిని. అప్పుడందు గ్రంథాలయ కార్యములు నడచుచుండెను. ఈ గ్రంథాలయము చిన్నదైనను రాయలసీమయందలి గ్రంథాలయముల కెల్ల నాదర్శప్రాయమైనదగును, దాని గాంచినతోడనే యనిర్వాచ్యమగు నానందమే నాకు గల్గినది. కార్యనిర్వాహకులగు శ్రీయుత ఎం. వెంకటరామయ్యగారుత్సాహనిరతులు, భక్తివినయతత్పరులు, దాక్షిణ్యస్వభావులు, త్యాగ