Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుందురు. మరికొందరు వేరొక విషయమునం దభిరుచి కలిగియుందురు. ఇట్లు ఏకవిషయమునందు పరిశ్రమ చేయగోరువారు ఒకగోష్ఠిగా జేరి ఏదో యొకగ్రంధమును గాని లేక ఒక విషయమును గూర్చి వేరు వేరు గ్రంథములనుండి గాని సవిమర్శకముగా విద్యాపరిశ్రమ చేయవచ్చును. అందుకు ఫలితముగ యొక సభను సమావేశపర్చి అందు గోష్ఠి సభ్యులలో సమర్థులైన వారు వ్యాసములను చదువవచ్చును. ఇట్టి వ్యాసములు కొన్ని చేర్చివాని నన్నిటిని ఆగ్రంథాలయము యొక్క లిఖతపత్రిక యను పేరిటప్రకటించ వచ్చును. ఎక్కువ సమర్థతను చూపగల వ్యాసములేవైన యున్నచో “భారతి” మున్నగు పత్రికలయందు ప్రకటించవచ్చును. ఈవిధమున గ్రంథాలయమునకు నూతనమగు విశాసము వచ్చును. ప్రత్యేకవ్యక్తులు వైదుష్యమునందు ప్రసిద్ధి జెందుదురు. ఇట్టిఫలము సిద్ధించినప్పుడే గ్రంథాలయములు సార్ధకమగును. భాష యభివృద్ధిజెందును. గ్రంథస్థమగు విషయములు విద్యావంతుల మూలమున ప్రజాసామాన్యమునకు కూడ వ్యాపించును.

పోటీపరీక్షలు మన యాంధ్ర దేశమందు మిక్కిలి పరిపాటిలో యున్నవే, విజ్ఞానచంద్రికామండలివారును నర్సాపురపు సంఘము వారును రాజమండ్రియందలి కొన్ని గ్రంథాలయముల పక్షమున పోటీపరీక్షలు జరిగినవి. సారస్వత విషయములనుగూర్చియు ఇతర విషయములను గూర్చియు పరీక్షలు జరుపుటయు ఉ త్తీర్ణులైన వారిలో అప్గ్రేసరులకు బహుమతు లొసంగుటయు ఈమూలమున జరుగు చుండెను. నర్సాపురపు సంఘము వారు ఇప్పటికిని నిరంతరముగ పరీక్షలు జరుపుచునేయున్నారు. తక్కిన సంఘములవారు జరుపు చున్నట్లు కనపడదు. తగిన సందర్భములుగల గ్రంథాలయములు ఇట్టి పోటీపరీక్షలను నెలకొల్పి చదువరులయందు విద్యాభిలాషను వృద్ధి పరచవచ్చును. కొందరు సామర్థ్యముగల విద్వాంసులు వారినుండి బయలు దేరుదురు.