Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లయములను గూర్చిన పరిజ్ఞానము ఈ దేశమున వ్యాప్తినొందినదని చెప్పవలసి యున్నది. జరిగినవని తక్కువ, జరుగవలసిన పని ఎక్కువ. ఇట్టితరి ఆంధ్రులు తమకర్తవ్యమును బాగుగా గుర్తెరిగి కార్యవిధానములను నిర్ణయించు కొనుటయు, దానిని కార్యాచరణలోనికి తెచ్చుటయు అత్యవసరము. లేనిచో ఇదివరకు జరిగిన కృషి యంతయు గూడ నిష్ప్రయోజన మగును.

ఇదివరకు మన దేశమున మారుమూలల గూడ గ్రంథాలయములు స్థాపింపబడి యున్నవి. పౌర గ్రంథాలయముల విధులేమో, ఇచ్చటి గ్రంథాలయములను నడుపువారలలో చాలమందికి తెలియును. వీనిలో అచ్చటచ్చట కొన్నిటికి స్వంతభవనము లున్నవి. కొన్నిటి యందు వేలకొలది గ్రంథములున్నవి. ఏకొద్ది సంఖ్యగల వానికైనను నిశ్చితమగు ఆదా యుండియన్నది. మన మ్యూన్సి పాల్టీలును లోకలు బోర్డులును గ్రంథాలయ నిర్వహణము తమ విధియని గుర్తెరింగిరి. దీని నంతను యాధార పరచుకొని మనము ముందంజ వేయవలసియున్నది.

ముందు జరుగవలసిన కృషి ఏదో ప్రథమమున నిర్ణయించుకొని, అటుపిమ్మట అందుకు సాధన విధానమును సూచించవలసి యున్నది,

గ్రంథాలయము యొక్క ప్రణము చదువరులు, వారి సంఖ్య యభివృద్ధి నొందుచు వారల విజ్ఞానము విశాల మగుచుండినగాని ఆసంస్థ శోభాయమానముగా నుండుటకు బదులు నిరుత్సాహకరముగా నుండును. కాన గ్రంథాలయాధికారులు ముఖ్యముగా చేయవలసిన విధి చదువరుల సంఖ్యను హెచ్చించుకొనుట. ఇందుకు అనేక మార్గములున్నవి. వాని నన్వేషించి కార్యాచరణలోనికి తేవలసి యున్నది.

విద్యాగోష్ఠులు, పోటీపరీక్షలు, తాత్కాలిక పాఠశాలలు, లిఖత మాసపత్రికలు మున్నగు సాధనముల మూలమున గ్రంథాలయపు చదువరులయందు అనేక విధములు జ్ఞానాభివృద్ధి చేయవచ్చును.

విద్యాగోష్ఠులను నేమో మొదట విచారింతము. కొందరు చదువరులు సారస్వత గ్రంథములు చదువుటయం దభిరుచి గలవారుగా