మనము తెలిసికొనవలయును. ప్రయత్నించినచో న సాధ్య మెద్దియును లేదు. ఇక, మన దేశమునకు ముఖ్యవృత్తి వ్యవసాయము. ఈ వ్యవ సాయమును ఇప్పటి పరిస్థితిని బట్టి పాశ్చాత్యదృష్టితో విమర్శించి తెలిసికొనవలసియున్నది. అట్లు తెలిసికొనిన యెడల మన మనేక విష యసులను నూతనముగా తెలిసికొనగలము, మార్కెటు ధరలను తెలిసికొనుట వర్తకోపయోగమగు పంటలనే వేయుట, ఆయా పంట ల కనువగునట్లు భూమిని సిద్ధపరచి వినియోగించుట, వీనికన్నిటికిని విద్య కావలయును. శాస్త్రీయముగ వ్యవసాయమును చేసి ఫలము ననుభవించుచున్న దేశములలో స్విజర్ లాండ్, అమెరికా యెక్కువ ప్రసిద్ధి జెందియున్నవి. మనదికూడ వ్యవసాయ దేశమేయైనను మనకు ప్రజ్ఞానము లేదు. అమెరికాలో నొక యకరము భూమిలో 8 పుట్లు గోధుమలు పండించినట్లు ఇటీవలనే చదివియున్నాను. కావున మనముకూడ విద్యాజ్ఞానముతోగూడిన వ్యవసాయమును చేయుటకు సాధనములను పరిశోధించవలసి యున్నది. ఇట్టివానికన్నిటికిని గ్రంథా లయములే యాధారములు, మీ గ్రామము మహాత్ముని పూజించిన గ్రామములలో నొకటి. మహాత్ముని యుప దేశములను వారి ముఖతా వినగల యదృష్టము మీకు లభించినది గావున మీరు మీ గ్రామములోగల తాగుబో తుల దురభ్యాసములను మాన్ని మహాత్ముని యుప దేశమును అనుష్టా నము లోనికి తేవలయును. ని
ఆంధ్రగ్రంథాలయోద్యమము
ముందు కావలసిన అభివృద్ధి మార్గములు.
ఇంత కాల మునుండియు ఆంధ్ర దేశమందంతటను గ్రంధాల
యోద్యమమును గూర్చి జరిగిన కృషికి ఫలితముగ బ్రిటిషు ఇండియా
యొక్క ఇతర ప్ర్రాంతములకంటె ఎక్కువ గాఢముగా పౌరగ్రంథా
2