నకు తగిన విజ్ఞానాభివృద్ధికి పత్రికలే ముఖ్య సాధనములని నాయభిప్ర్రాయము, దిన వారపత్రికలు తాత్కాలిక వృత్తాంతములను దెల్పును. మాసపత్రికలు అనుభవనీయులగు వారల వ్యాసములతో విజ్ఞానాభివృద్ధికి మంచి సాధనములు. మన గ్రామములలో చదువు రాని వారి సంఖ్య యెక్కువగాన నీ చదువుకొనిన వారు చదువురానివారలకు చదివి వినిపించుచుండవలయును. మనము తెలిసికొనిన వారము గదాయని యానందించుటతో, ప్రయోజనము యేమియును లేదు. ఇతరులలో విజ్ఞానవ్యాప్తిని గావింప ప్రయత్నింపని విద్యావంతుడు విజ్ఞానద్రోహియని నాయుద్దేశం. దేశము, బుద్దుని యుదాహరణముగ గైకొనుడు. తన విజ్ఞానమును దేశమునందంతటను వెదజల్లినాడు. తనకుగల విజ్ఞాన వ్యాప్తికి సంస్థలను స్థాపించినాడు. గ్రంథాలయములన నిట్టి సంస్థలే కాని యిప్పటి గ్రంథాలయములలో పెక్కులు నామమాత్రములుగ నున్నవి. పూర్వము దేవాలయములలో నుండెడి గ్రంథములను గ్రామప్రముఖులును, రాజాస్థానములలో నుండెడి వాటిని, రాజులును రక్షణ చేయుచుండిరి. ఇప్పటికైనను పురాణ పఠనపద్ధతి ప్రతి గ్రామములోను ఉండవలయును. ఉపపత్తి కలిగిన వారలు దీనిని నడుపుట యుక్తము. మన సనాతన గ్రంథాలయ ప్రతిష్ఠాపనము "వార హేస్టింగ్సు" కాలమునుండీ లుప్తమైపోయినది. ఇంగ్లీషు పాఠశాలల ఆరంభముతో మాతృభాష సంస్కృతభాషలు, వాని యభివృద్ధి ప్రయత్నములు మూలబడి పోయినవి. ప్రభుత్వము వారికి దేశభాషలలో రాచకీయ వ్యవహారముండుట పనికి రానందుననే పై పరిస్థితి యేర్పడియుండెను. రాజా రామమోహన రాయలు ఇంగ్లీషు సర్వవ్యాప్తిని వాంఛించినను మాతృభాషాభివృద్ధియందాయన చాల కృషి సల్పెను. మనమీ విషయమును మఖ్యముగా గమనింపవలసినదై యున్నది. మన సాహిత్యమును గురించి పరదేశీయులు విమర్శించి, మెరుగులను తీసి చూపుచుండ మనము పురాణపఠనములతో తృప్తిపడగోరుచున్నాము. పారమార్ధికము తప్ప ఆధిభౌతిక విషయములయందు మనకు శ్రద్ధలేదు. మన మీ రెండింటిని సమన్వయ పరుపవలసి యున్నది. దయానంద సరస్వతి అట్లు చేసినాడు. ప్రాచీన లిపులను గూడు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.11-12 (1929).pdf/10
స్వరూపం