Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.10 (1929).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ వాణీవినోద గ్రంథాలయము, మద్రాసు

ముద్రిత అనుద్రిత గ్రంథములేగాక, యుద్ధసమయమందును, దానికి పూర్వమందును ప్రకటింపబడిన ముఖ్యములగు పత్రికలన్నిటిని ఈ గ్రంథాలయమును సేకరించి. 1914 సంవత్సరము మొదలు 1919 సంవత్సరము వరకుగల యుద్ధమునకు సంబంధించిన గ్రంథములుగాని, కరపత్రములుగాని, పత్రికలుగాని, పండితవాఙ్మయముగాని, ఈ గ్రంథాలయముందు సంపూర్తిగా గలవు. మరే గ్రంథాలయమందును ఇంతసంపూర్తిగా లేనేలేదని జెప్పవచ్చును. బెల్జియం, ఫాసు, జర్మనీ, గేటు బ్రిటను, హాలండు, రష్యా, సిట్జర్ ల్యాండు, యూనైటెడ్ స్టేట్సు - దేశమందలి ప్రధాననగరములయందు ప్రకటింపబడిన దినపత్రికలయొక్క బైండు చేయబడిన సంపుటములన్నియు ఈగ్రంథాలయమందు గలవు.

ఈగ్రంథాలయమందు 65,000 గ్రంథ సంపుటములు గలవు. ఇవిగాక పత్రికాసంపుటములును కరపత్రములును గలసి 65,000 ఉండును. ఐరోపా మహాయుద్ధ చరిత్రను గూర్చి పరిశోధన గావింపదలంచిన వారెవ్వరైనను ప్రపంచమునందే భాగమునందున్నను ఈ గ్రంథాలయమును దర్శింపక తిప్పదు. హెూవకు మహాశయుని పరిశ్రమా ఫలితమే ఈ గ్రంథాలయ మని వేరుగ జెప్పవలెనా ! ఆ మహనీయుని నామము తర తరములవరకు వన్నెకెక్కగలదు,




శ్రీ వాణీవినౌద గ్రంథాలయము, మద్రాసు

౧౯౨౯ సు॥ జనవరి నెలయందు ఈ గ్రంథాలయము స్థాపింపబడినది. 800 గ్రంధ రాజము లున్నవి. జార్జి టనులో గోడవును వీధి యందు నెం. 1-34 రు ఇంటియందు పెట్టబడినది.