చాలభాగము అనేక శతాబ్దములనుండి పనిచేయకపోవుటచే మూలబడి పోయినవి, అంతేగాదు, అవి ఎక్కడనున్నవో ఎవ్వరికిని తెలియదు. మన కథానాయకుడగు " హెూవరు” గారు “స్వీడనుబర్లు” వ్రాసిన గ్రంథముల నెల్ల శ్రద్ధతో పరిశీలించి, మూలబడిపోయి అవిఉన్న స్థలము కూడ తెలియబడకఉన్న గనులనన్నిటిని పైకిదీసి, ఆ దేశమునకు అనంతమగు మహెూపకారమును గలిగించిరి.
హెూవరుగారి భార్య భూగర్భ శాస్త్రమందు పట్టపరీక్ష నొందెను. లాటిక్ భాషయందు లోహశాస్త్రమును గూర్చి గల ప్రాచీన ఉద్గ్రంథము నొకదానిని ఆయన తన భార్య సహాయముతో మిక్కిలి పరిశ్రమ జేసి భాషాంతరీకరించేను. లండమునందు ప్రకటింపబడిన ఈ భాషాంతరీకరణము ఇప్పుడు అపరూపముగా నున్నది. అయినను పరిశోధకులెల్ల దానికొరకు అక్యాతురులై సంపాదించెదరు, ఆ భాషాంతరీకరణమును ఇప్పుడు జర్మను భాషలోకి పరివర్తింప ప్రయత్నములు జరుగుచున్నవి.
ఆయన అనేక అమూల్య అముద్రిత పండిత గ్రంథములను సేకరించి తుదకు “స్టాన్ఫోర్డు" విశ్వవిద్యాలయ గ్రంథాలయమునకు ఇచ్చివేసెను.
ప్రాపంచకము నంతను అల్లకల్లోలము జేసిన ఐరోపా మహాయుద్ధమును గూర్చిన పరిశోధక సాధనములన్నియు “స్టాక్ పోర్డు " విశ్వవిద్యాలయమునం దేర్పరుపబడిన "హెూవరు యుద్ధ గ్రంథాలయము” నందు గలపు. ఈ గ్రంథాలయమునకు ప్రాతిపదికగ నేర్పడిన పరికరములు సేకరించుటకు రు 1,50,000 లు వ్యయమయ్యెను. యుద్ధసమయము నందు 53 దేశములవారు ప్రకటించిన ప్రకటనములన్నియు ఇందు సేకరింపబడెను. సుప్రసిద్ధ భాషా సేవకు అనేకమంది అపూర్వములగు వ్రాతప్రతులను సేకరించి, ఈ గ్రంథాలయమున కొసంగిరి.