Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.10 (1929).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుండువారు. కొందఱు స్త్రీలు ప్రత్యేకము విద్య నభ్యసించెడివారు. కొందఱు విద్య నభ్యసింపకపోయినను శ్రవణం చేతనే విద్యా విషయములు దెలిసికొని వివేకవృద్ధి గావించు కొనుచుండెడివారు. బృహదారణ్యమున వినబడు గార్గి, మైత్రేయి మున్నగు విదుషీమణుల చరిత్రములే ఇందుకు తార్కాణము.

ఆకాలమునకు తర్వాత క్రమముగ దేశమున మార్పులు గానుపించెను. క్రమక్రమముగ నా కట్టుబాట్లు సడలెను. ఆచార్యు లరుదైరి. అంతేవాసులంతకన్న నరుదైరి. కావున చరమరూపమున నుండు గ్రంథాలయములు స్థిరరూపము దాల్చవలసివచ్చెను. ఋషుల యనుభవములు, విద్యావిధానములు, చర్చలు, ప్రయోజనములు, గ్రంథస్థములు చేయబడెను. ఋషుల మొదలు కొంతకాలము క్రిందటివరకు గ్రంథ రచనమన్న చాల భయపడువారు. ఏకదీక్షతో నొక్కొక్కరు తన జీవిత మంతయు గ్రంథ రచనమున వినియోగించెడివారు. ఒకరు గ్రామమున రోళ్ళవద్ద పడిన కణముల భుజించి తర్కశాస్త్రమును రచించెనట. ఇంకొకరు నీరుత్రావుచు గ్రంథములు రచించెనట. వేరొకరు వాయు భక్షణమాత్రము జేయుచు గ్రంథములు రచించిరట. వాచస్పతిమిశ్రులను నొక పండితులుండెడివారు. కాళిదాసాది సంస్కృతకవులు, నన్నయ, తిక్కన పెద్దన పోతనాది యాంధ్రకవులు, మొదలగు పండితు లెంతెంత శమపడి గ్రంథములు రచించిరో చూడుడు. మహామహులు రచించిన గ్రంథము లపూర్వయనుభవములతో నిండినవి. ఇట్టి గ్రంథములు చేర్చియుంచినవి గ్రంథాలయములు. గ్రంథాలయలు కేవల గ్రంథముల సమకూర్చిన నిష్ప్రయోజనము. త్రిపుటి కావలయు. గ్రంథములు ప్రజలు చదుపు త్రిపుటి. గ్రంథములున్నను లాభము లేదు. ప్రజలున్నను లాభములేదు. గ్రంథములను చదువరులు చదివి, వానియందున్న యమూల్యోపదేశముల దెలిసికొని, ఆయా దేశము ననుసరించి,