Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.10 (1929).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ॥ ఒక పూట సత్క శా ♦ శీయుతులైన పండిత
    సద్దోష్ఠిచే పొద్దు ♦ జఁపియుంట
    ఒక నాడు సత్కవి ♦ ప్రకరముల్ మెచ్చగా
    స్వీయకృతుల్ విన్కి ♦ సేసియుంట
    ఒక వేళ మిత్రులౌ ♦ నుద్యోగ సమితితో
    మొచ్చట్లతో పొద్దు ♦ పుచ్చియుంట
    ఒకట జమీందారు ♦ లురుభక్తి నరుదెంచి
    అడిగిన సలహాల ♦ నుడివియుంట

గీ॥ పండితుండన, కవియన, ♦ పంతు లనగ
    రావన, యమాత్యుడన జనుల్ ♦ వేవిధాల
    పలుకతగి దాసు శ్రీరామ ♦ పండితుండు
    కీర్తితోడ ఛాయాపటా ♦ కృతిని వెలసె॥

సీ॥ అజ్ఞానతిమిరమ్ము ♦ శ్రీ లడగింపజాలిన
    యర్కబింబంబు గ్రంథా ♦ లయంబు
    ఆనందదాయక ♦ మౌ ప్రసంగము సేయు
    ఆప్తమిత్రంబు గ్రంథా ♦ లయంబు
    సంశయ విచ్ఛేద ♦ సామర్థ్యముంగన్న
    ఆచార్యకంబు గ్రం ♦ థాలయంబు
    గ్రంథరూపంబున ♦ రహీప్ర్ర కాశించు వా
    ణీలలామంబు గ్రం ♦ థాలయంబు

గీ॥ అట్టి గ్రంథాలయంబుల ♦ కన్నిటికిని
   ఘనశిరోభూషణం బన ♦ గ్రాలు రామ
   మోహన గ్రంథనిలయంబు ♦ బోవుడయ్య
   పరమకృపతోడ బెజవాడ ♦ పౌరులార!

— ప్రతాప వేంకటేశ్వరకవి