ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ॥ ఈవిచ్చుపొత్తమ్ము ♦ లింటికిం గొనిపోయి
యెందఱో సతులు ప ♦ ఠించుచుందు
నీసన్నిధికి వచ్చి ♦ నిత్యంబు పత్రికల్
ముదమంది పూరుషుల్ ♦ జదువు చుంద్రు
ఏ మహాసభ నేని ♦ శ్రీ యిచ్చోటనే సల్పి
పౌరులు సంతృప్తి ♦ వడయుచుంద్రు
ఏ మహాత్ముడుకూడ ♦ నీవురి కరుదెంచి
నిన్ను గూర్చియె చాల ♦ సన్నుతించు
గీ॥ అనుదినమ్మును విద్యార్థు ♦ లాసపడెడు
జ్ఞానఫలముల నిడు కల్ప ♦ శాఖ వగుచు
మించ జగ దేక సత్కీర్తి ♦ గాంచితమ్మ
రామమోహన లైబ్రరీ ♦ నామ జనని!
సీ॥ ఆంగ్లభాషపఠించి ♦ ఆరి తేరిన న్యాయ
వాదులకు న్న్యాయ ♦ వాదియయ్యె
జ్యోతిషపండిత ♦ చర్చలం జర్చించి
నేర్పరియై మేటి ♦ తీర్పు దీర్చె
కులగోత్ర గరిమంబు ♦ దెలియ వైశ్యాళికి
ధర్మదీపికనొండు ♦ తగ రచించే
విద్వజ్జనుల్ కవుల్ ♦ వేయినోళ్ళ నుతింప
దేవిభాగవతంబు ♦ తెలుగు జేసె
గీ॥ ధీరుడనగను సుందరా ♦ కారు డనగ
నిపుడు ఛాయాపటాకృతి ♦ నెలమి నిలిచె
దాసు శ్రీ రామపండిత ♦ ధన్యుడిందు
రామమోహన లైబ్రరీ ♦ నామ జనని!