Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.9 (1925).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైసూరునందు గ్రంథాలయోద్యమము

ప్రాచీన కాలమునుండియు మైసూరు రాజ్యము పండిత బ్బందమనకును, విద్యాపోషణకును ప్రఖ్యాతి చెందియున్నది. ఈ సంస్థానాధీశుల యొక్క ప్రాపకమువలన వాఙ్మయాభివృద్దికి కొరత లేకుండెను. ఆరాజ్యమనందుగల విద్యాసంస్థల యొక్కయు, గ్రంథాలయముల యొక్కయు, విద్యాసంస్థల యొక్కయు, ప్రదర్శనశాలల యొక్కయు సంఖ్యయే ఆరాజ్యాధిపతులకు సంస్థాన ప్రజల యొక్క అభివృద్ధి యెడలగల అభినివేశమును వెల్లడిచేయుచుండును. ప్రస్తుతము మనము అరాజ్యమందలి గ్రంథాలయోద్యమమును గూర్చి కొంత చేసుకోందము.

ప్రాచీన కాలము

పూర్వము గ్రంథాలయములన్న పుస్తకములను చేర్చి ఒకచోట పెట్టుయు, ఆవి వాని స్వంతదారులకు మాత్రము ఉపయోగపడుటయు మాత్రము జరుగు చుండెను. మైసూరు రాజమందిరమునందున్న టిప్పు సుల్తాన్ గ్రంథాలయము, శృంగేరి మఠమునందుగల గ్రంథాలయమునుఁ ఇట్టివియేను. 1915 సంవత్సరమునకు పూర్వము వానిని జనులకు ఉపయోగకరములగునటుల చేయుటకు ప్రయత్నమే మాత్రమును జరిగియుండలేదు.

నవీన కాలము

స్వల్ప సంఖ్యాకులుగనున్న విద్యాధికులకు ఆనందము నోడగూర్చుటయే గాక, వారి ఇచ్ఛకు వ్యతిరేకముగ వైజ్ఞానాభివృద్ధి నొందని వారికిగూడ విద్యాసక్తిని గిలిగించి, సంతృప్తి పరచుటయే నేటి సార్వజనికగ్రంథాలయములయొక్క ధర్మమై యున్నది. ఈ నూతనా ధిప్రాయము పాశ్చాత్య దేశములందు 60 సంవత్సముల క్రిందట వ్యాపశమునకు దెబడి, జనులకు జ్ఞానాభివృద్ధిని జేయుటకు అమూల్యమగు మార్గముగ పని జేయుటచే నాగరికతబొందిన దేశములన్నిటియందురు విశేషమగు వ్యాప్తిని బొందినది. ఈ యభిప్రాయము 1909 సంవత్సరమున బరోడా మహారాజు గారిచే భారతవర్షమునకు గోణితేబడినది. అందుచేత వారు భారత గ్రంథాలయోద్యము జనకుడిని పిలువబడుచున్నారు. ఆమెరికాదేశపార్వజనిక గ్రంథాలయపద్ధతులు ఒరోడా రాజ్యమందు జయప్రదముగా నిర్వహింపబడుట చేత పాశ్చాత్య గ్రంథాలయ పద్దతులను హిందూదేశమందు నాటుట మంచిదిగాదను అనుమానము భారతీయుల మనస్సులనుండి తొలగిపోయెను.

బరోడా రాజ్యమందు. ఈ నూతమౌద్యమము జయప్రదమగుటను గమనించి మైసూరు గవర్నమెంటువారు గూడ 1914 సంవత్సరమున బెంగుళూరు పట్టణమందొకటియు మైసూరుపట్లణమునందు కొకటియు ధర్మగ్రంథాలయములను ప్రతిస్థాపించినారు. వీనికి 35 వేలు రూపాయల ఖర్చు ఆయ్యెను. ఇవి గాక ప్రతిసాలు నా రు 6,800 లు ఖర్చుఅగు చున్నవి.

ఈ గ్రంధాలయములందు రెండుశాఖలు గలవు. చందాదారులకు పుస్తకములకు ఇండ్లకు ఎరుకవచ్చు శాఖ యొకటి; జనులను ధర్మార్థముగా చదువుకొననిచ్చు శాఖ రెండవది. ఈ గ్రంథాలయములు 15 గురు సభ్యులచేత పరిపాలింప బడుచున్నవి. అందు ఏడుగురు సభ్యులు చందాదారుల చేత ఎన్నుకొన బడుచుందురు. మిగిలినవారు మైసురు గవర్నమెంటువారిచే నిర్ణయింపబడు చుందురు. అవి కొంతవరకు చందాలవలనను, మరికొంతవరకు గవర్నమంటు వారివలనను పోషింపబడుచున్నవి.

నవీన అమెరికాదేశ ధర్మగ్రంథాలయ పద్ధతులను, అవలంబించుట చేత బెంగుళూరు గ్రంథాలయముల పదిసంవత్సరముల కిందట మాత్రమే స్థాపింపబడినప్పటికిని, దక్షిణహిందూదేశమునందెల్ల ఆస్థానమును వహించినదిని చెప్పవచ్చును. గ్రంథవివరణము, పుస్తకములను ఎరువిచ్ఛుపద్ధతులు, అమెరికాదేశ నవీనశాస్త్రపద్ధతులను అనుకరించియే యున్నవి. స్త్రీలును, పురుషులునుగూడ ప్రత్యేక ప్రత్యేకముగ కూర్చుని చదువుకొనుటకై గదులు ఏర్పాటు చేయబడినవి. పిల్లలకు ప్రత్యేక శాఖ ఏర్పరుపబడినది. బీదలు గ్రంధములు ఎరువుదీసికొనుట కొకశాఖ వర్తక పారిశ్రామికాదివీ విషయములకు ప్రత్యేక యొక బల్ల, ప్రత్యేక యొక ప్రచురణశాఖ, స్నానపుదులు, ఫలములగది, ఇట్టివి ఎన్నియోగలవు. ఇందుగల గ్రంధము యొక్క ఆధిక్యతనుబట్టియు మధ్యస్థలమునందుండుటను బట్టియు, ఇది కేంద్రగ్రంథాలయము గాక తప్పదు.

ఇంతటితో నూరుకొనక మండల గ్రంథాలయములను, తాలూకా గ్రంధాలయములను గూడ ఏర్పాటు చేయుటకు 1917 సంవత్సరమున వైనూరు ప్రభుత్వము వారు పూసుకొని అట్టివానిని ఏబదివరకు ఏర్పడిచినారు. పిమ్మట గామ గ్రంథాలయ స్థాపనకు గడంచినారు. స్థానికులు కొంత సహాయమును చేయునెడల ప్రభుత్వము వారు గూడ కొంత సహాయముతు చేయుటకు పూనుకొన్నారు. కాని గ్రంధములు చదువుటవలన ప్రయోజనములను జనులు గ్రహింపజాలమిచే ఈ సహాయమును







గడం నారు,


ను