దిన దిన మొకపొందికయగు అందము తేటదేరిమెరియ
గొనబారెడి ముఖకోమల కాంతులు కొదమపన్నె లీన
బాలుని బాల్యము పసిడియుయాలల భాగ్య సౌధములలో
లాలించిరి కడుగారాబంబున లీలల జోలలతోన్
పన్నెండేండ్ల కుమారుని ప్రాయము పడుచుదనమురాగా
నున్నని మీపము నూనూగుగ మొలకెతి మోజులీ నె౯
ఈడువచ్చి కళలీనెడి బాలుని ఇంపుసొంపులరసి
ఈడును జోడును కులశీలములును కూడినరాజింట౯
మగువమాంచాలకు మానధరుండుగు సొగసులబాలునకున్
తగినవధూవరులంచును చూపరు లగణితముగ బొగడ
కలిసె బాలునకు కర్మవశంబున కామిన సబ్బాయీ
వెలసఖి పలుకులు కులంకులు తళుకులు వింతమందులగుచూ
తాళిగట్టి తను బాసలుజేసిన ధర్మపత్ని మంచాల౯
తన కర్మంబని దైవకృతంబని ధర్మపథము విడక
తెల్లనికోకలు తీరిచికట్టదు మల్లెపూలసరుల౯
సల్లాపింపక మాసినమెయితో చాన గడుపు దినముల్
ఆట బాలుండొకనాడుదయంబున ఆటల తమకమునా
నీటుఁగోటుగ బొంగరాలాటకు బాటించిరి వేడ్క౯
నిమ్మలబావికి నీరుదెచ్చుటకు నెలతలేగుదెంత్రూ
సమ్మదమంగుచు నిమ్మళముగ నట జనుచునుండె నంత౯
తాకిన బొంగ్రపుదెబ్బకు వనితయు తల్లడిలుచుగూలీ
తాళలేక బాలచంద్రుని దిట్టుచు తరుణులెల్లమూగ౯
ఓరిమదాంకుడ, ఓరినరాధను ఓరికులద్రోహీ
ఆరయజాలవు కండకొవ్వున కులగౌరపములు నేనీ
వారవధూటికి ఆడుగులొత్త నలవాటుపడిన నీవూ
క్రూరుడవై కులకాంతా జనములు కొట్టసాగినావే