అందు సమీపమునందు మనౌహర మందమందగతుల
సందడి పారెడు నాగులేరు జగు లందరు సేవింపా
యేటికి యిటునటు సొంపారగ సమరారెడు నగిరీ
తేలియక యేలిరి పౌరుషవంతులు పేరెన్నిక గాంచా
మరల మంత్రిశిఖామణియై కడు వాసిగాంచి మించె
నారాయణపద నలినమ్ముల మది నమ్మి సుకృతిగాంచె
గట్టి కదనంబున శత్రుల కడికండలు సేయా
పథమున ఒక కాల్పాలకు ఒక కాల్మంటలనూ
కీర్తిని అడవులలో బోయలం గూడను బాడా
స్వర్గము గల్పించెను అతిపణ్యవంతమౌచూ
శ్రీనాయని భార్యారత్నము పరమ సుగుణవల్లి
సతీపద పద్మ సమార్చన భాసిల్లిన మల్లీ
అర్హుల కీయ నన్నపూర్ణయని అందరు కొనియాడా
వర్ణిలె పుణ్యనివాస మనంగను వడివంకలు లేనీ
చేసినపూవుల చిత్తిపూజలును శ్రీపతిసేవలుమా
వాసి ఫలింపగ ఐతమగర్భము భాసురముగ పండెన్
మహనీయుండగు ఐతమపుత్రుడు మహిపై బడువేళ౯
దహనుని ప్రళయము తాకిన పగిదిని దద్దరిల్లె జగముల్
ఆబాలుని శీరోదయ సమయమునందుపడిన నీరూ
ప్రాబల్యంబున పగులకొట్టుకొని పాతాళము కేగె౯
వీరుడు వీరుడు వీరుడటంచును వితికంఠమెత్తి
పారిజాతములు జోరుగగురిసెను పరిమళములు పొదలా
కానక కన్నకుమారుని గాంచియు కన్నులపండువు గా
తెలిపిరి బాలుండితడని భూసుగతిలకులు మంత్రోక్తి౯