Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.9 (1925).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్నాటి వీరచరిత్ర

[1]

దేశగౌరవము దీపింపగా తమ దేహమ్మలు గోసి

వీర - వేశంబున బోరి
రక్త - పోశనములు బట్టి

ఆశ మెయిన్ తలిదేశఋణంబును దీర్చిన వీరులనూ

తల్లీ! వేడుక - వినుతిఁతూ

అంధ్రవీరులకు ఆభరణంబయి అమృతకిర్తిమించీ

రణమున - ప్రాణము లర్పించీ
వీరా - స్వర్గము సేవించీ

నరులును సురలను నవనవ కవితల నతులీయగ వెలసీ

శూరుల - నయగతులను నిలిపీ.
3

వెలిగిన బాలుని వీర చరిత్రము వీరుల కింపైన

తీయని - పలుకుల సొంపెన
రసములు - గులుకగ సొగ సైన

లలితపు శైలిని వలతితవంబులు కలితముగా గూర్చు

తల్లీ! ధన్యత చేకూర్చు

అతిరమ్యంబగు నాంధ్ర దేశమున నలరాడు వీడూ

ఇంద్రుని - అమరావతితోడూ
ధనదుని - ఆలకాపురి జోడూ

వ్రతముల క్రతువల పాడిపంటలను వర్దిలెడి ణేడు

వీరులు - పుట్టిన పల్నాడూ

.

  1. ఈ కీర్తనములు ఒక స్నేహితుని ఇంటియందు ప్రాత కాగితములందు దొరకినవి. ఏ కాలమునాటివో తెలిఁయక ప్రాచీనకవికృతములై యుండుననుటకు సంము లేదు. శ్రీనాథ మహాకవియే దీనిని రచియించి నోపునని పలువురు స్నేహితులు తలంచుచున్నారు. మిక్కిలి రసవంతకులుగా నుండుటచే ప్రచురుణకు బంపితిమి, మిగిలిన భాగము ఎక్కడనైన దొరకినయెడల దానిని పంపిన మిక్కిలి కృతజ్ఞతతో ప్రచురించుటకు ఆంధ్రదేశమునకు అట్టి భాగ్యము జేకూరుగాకయని భగవంతుని ప్రార్థించుచున్నాము.