ఱూతిభూములు, బురద మడుగులకు పోల్చతగిన కొన్ని గద్య కావ్యములును సర్వపుష్పఫలశోభికమ వనాంతరములు, నేత్రపర్వము నొనర్చు రమణీయమగు ఉద్యానవనములు, నైలు గంగా మొదలగు మహానదులతో పోల్చదగ్గు పద్య కావ్యములును ఇందున్నవి. ఇవి యన్నియు మనుజునిదైనది జీవయాత్రకు అవసరమైనవి కావు. అయితే ఇందులో లేనివి మాత్రము గ్రంథాలయమందు, గృహస్తుని ఇంటియందును, గ్రామమందును, గ్రంథాలయమందును, భద్రపర్చతగినవి. బొమ్మ జెముడును ఉద్యానావనమందు పెంచవలెనని ఏ మనుష్యుడును వాంచించడు. కాని ఔషధీవనములో వైద్యుడు దానిని పెంచితీరవలయును. మనుజుడు కుక్కను, ఆవును తనయింట పెంచను గాని సింహమును పెద్దపులిని పెంచడు. వీనిని వివిధ జంతు ప్రదర్శనశాలయందు జంతుశాస్త్రజ్ఞుడు పెంచును. ఔషధీవనము జంతుప్రదర్శనశాలయు కూడ సంపూర్ణముగ ప్రయోజనకరములని చెప్పుటకు దలనుపడదు. పెద్దపులియొక్కయు,సింహము యుక్కయు, సంపూర్ణ స్వభావము స్వాభావికస్థితిలో వనమున వేటాడునపుడు వ్యక్తమగును గాని బందీకృతముగా బోనులో నుంచినపుడు కాజాలదు. నూతనముగా అభివృద్ధిని గాంచుచున్న జంతుశాస్త్రజ్ఞులకు ఈ ప్రదర్శన శాలలవలన కొంత ప్రయోజన ముండవచ్చును. ఆది ఉత్తమ ప్రయోజనము కానేరదు. సనాతనమగు ధర్మమును బోధించు గ్రంథములే గ్రంథాలయముందుండతగినవి. అచ్చుపడినంత మాత్రమున గ్రంథాలయమున గ్రంథమునకు స్థానముండరాదు, ముద్రణ యంత్రమును, ప్రజాస్వామికతత్వము యొక్క అపభ్రశ్రభావమును ప్రతి గ్రంథమునకును గ్రంథాలయమున స్థాన మిచ్చుటకు కారణములు. గ్రంధ ప్రకాశకులు కూడ ప్రతిగ్రంధమును ప్రకటించరాదు. నిజమగు గ్రంథాలయమందు వేదములు, ఖురాను, బైబిలు, తత్వశాస్త్రగ్రంథములు, ప్రకృతిశాస్త్ర గ్రంథములు, విజ్ఞాన సర్వస్వములు మొదలగు నుద్గ్రంధములు మాత్రమే యుండతగినవి. వివిధ వస్తు ప్రదర్శనశాలలు, భారతీయజాతిజీవనమునకు అనుగుణ్యమైనవికావు. అవి మనుజుని లలితకళాసౌభాగ్యమునకు శ్మశానవాటికల వంటివి. అచట భస్మము, బొమికెలు మాత్రము భద్రపర్చబడును. ఇవి యన్నియు చరిత్ర కాధారమని చెప్పెదరు. పితృవర్గము యొక్క సుగుణపుంజమును విశదీకరించుటకు ఈ కాలపు చరిత్రలు ఎంతవరకు ఉపకరించుచున్నవి? దేవాలయముసు మసీదును జీర్ణోద్ధారణ చేసినచో పితృవర్గము నెడల మనకుండు భక్తిని ఎక్కువబాగుగా తెలుపుడు చేయదా! స్వాతంత్య్రభావమే ఇప్పుడు ప్రపంచము నంతను ఊగులాడించుచున్నది. ఈ తత్వము యొక్క సరియైన వ్యాప్తి సామాన్యజనులకు సంపూర్ణముగా వ్యక్తమగుటలేదు. అధునాతన మనుజునకు సమ్రతలేదు. కృతజ్ఞత లేదు. చరిత్రయన అతనికి ఎక్కువ సరదా. అదియే అతనికి తెలుసును. వైచిత్య్రముచే మమోహరముగు జీవితతత్వము ఆతినికి సామాన్యముగా బోధపడదు. కాలప్రవాహమున అతడుపడి కొట్టుకొనిపోవుచున్నాడు. ఆధునిక గ్రంథ భాండాగారికుడు గ్రంథ విభజన పట్టికలను వ్రాసినట్లుగానే ఆధునిక మనుజుడు సమాధుల మీద మృతమనుజుని సంక్షిప్తచరిత్రను మాత్రము వ్రాయగలడు. నిజమైన రసస్ఫూర్తిగల ఏవ్యక్తియు వివిధ వస్తుప్రదర్శనశాలను మాని ఆనందము పొందనేరడు. గ్రంథాలయముకు వివిధ వస్తుప్రదర్శనశాల కాకూడదు. కూడదు. కుంఠీభావమును పొందిన మనుజుని మనోవికారమునకు ఫలితమగు నుత్పన్నమగు అధమ గ్రంథములకు గ్రంథాలయమున స్థానముండరాదు. సార్థకమగు గ్రంథాలయమఁదలి గ్రంథములం మనుజుని మానసిక, నైతిక జీవితము నుత్తేజము చేయునవిగా నుండవలెను.
ఇంక గ్రంథాలయముల వలన సంఘమునకు కల్గెడు లాభములనుగూర్చి వివరించెదను. ఈ ఉద్యమ ప్రచారకులు ప్రతి గ్రామమందును ఒక గ్రంథాలయము స్థాపించివలెనని వాంఛించుచున్నారు. అట్లు చేసినచో మనుజుని జీవితమును సర్వతోముఖముగ వికసింపచేయ గల్గును. మనుజుని సాంఘిక, నైతిక, మానసిక తత్వముల యభివృద్ధికొరకు దొరతనమువారి తటస్టభావకారణమున మనదేశమన తగిన సాధనములు లేక యున్నవి. ఈవిధులను పూర్వపురాజు నిర్వర్తించుచుండిరి. ఇపుడు ఫ్రాన్స్ దేశమున లలితకళల అభివృద్ధికొరకు రాజ్యాంగమున ప్రత్యేక శాఖకలదు. ఇట్లే పాశ్చాత్య దేశములందన్నిటియందునుకూడ కలదు. సాంఘికాభివృద్ధికొరకు అచ్చటి ప్రభుత్వములు విశ్వప్రయత్నిములు చేయుచున్నవి. మనదేశమున మాత్రమే ప్రభుత్వము వారు ఈయన్ని విషయములయందును మూకీభావమును పొంది యున్నారు. ఆంధ్ర గ్రంథాలయ సంఘమువారు ప్రతిగ్రామమందును ఈ జబాబుదారీ వహించవలెనని నా యాశయము. రాజకీయ విషయములయందు కృషి చేయుటకు ప్రతి గ్రామమందును కాంగ్రెను సభయుండునుగాన తక్కిన అన్ని విధములగు మనుజునీయభివృద్ధుల గూర్చియు పాటుపడుటకు తగినట్లు గ్రంథాలయములుండవలెను. అట్టయినచో గ్రంథాలయములు, జీర్ణమై