Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.8 (1925).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనము వినుధ్వనికంటే నాదము ఎక్కువ సున్నిత మైనది. మనకు అనుభూతమగుదానికంటే దానియందు ఎక్కువ అర్ధము లీనమై యున్నది. ఏక వస్తువు వివిధశబ్దవాచ్యపై వివిధ స్థలములయందు వివిధ మానవుల చేసుచ్చరింప బడుతున్నది. ఉదాహరణకు దహింపచేయు వస్తువు నొకదానిని తీసుకొందుము. ఒకరు దీనిని ఫైరు అనిపిలుతురు. మరియొకరు అగ్నియందురు. ఇంకొకరు నిప్పు అందురు. వస్తువు ఒకటే, వేరువేరు మనుష్యులు, దీని పేరును, వేరువేరుగా ఎందుకు వ్యవహరించవలెను? హలుఫైరు అనుశబ్దము వినినతోడనే మనకు కొన్ని యూహములు కలుగుచున్నవి. లంక లంగుచున్నవి. అగ్నియను మాట వినినతోడనే మరియొక విధమగు సూహలు కలుగుచున్నవి. ఈ రెండు మాటలు రెండు భాషలలోనివి. ఈ రెండుమాటల ఉచ్చారణవలన కల్గెడీ మనోభావములు వేరుగానున్నవి. అవి వ్యక్తితో సంబంధముకలని, మనము మన ఇష్టదేవతలనే యారాధింతుము. పరిస్థితితో కూడినపుడు గాని వ్యక్తిత్వమునకు సంపూర్ణవికాసము చేకూరదు. ఈ అనంతమగు బ్రహ్మాండమందు అనేకమగు అంతరము గల లం గల పరిస్థితులుండియున్నవి. ప్రతివ్యక్తియు తన కనురూపమగు పరిస్థితి నాశ్రయించు చున్నాడు. గ్రంథాలయమున చదువరు లందరకు సమానమగు సావకాశములు కల్గచేయుట యుక్తమేగాని ఈసావకాశములను సద్వినియోగము చేసికొనుటకు తగిన సహాయము లేనిచో అందువలన అనర్థకములు కల్గును. కావున ఉచిత గ్రంధములను చదువరి ఏరుకొనుట ముఖ్యావసరము. తాత్కాలిక ఉద్రేకము చేతను అసంస్కృతవాంఛచేతను పఠనీయ గ్రంథమును నిర్ణయించు కొనినచో దారి ఎప్పుడును తప్పుగానే పోవును. చదువరియొక్క అధికారమును నిర్ణయించి తదనుగుణమగు గ్రంథమునూ పఠింప చేయుటకు తగిన గురువు గ్రంథాలయమందుండితీరవలయును. చదువరియొక్క ఇష్టదేవత ప్రళయ కాలాగ్ని రుద్రుడైయుండి ప్రళయకాలమందు బీభత్సరసముతో నాట్యముచేయు నటరాజుయొక్క పదవిన్యాసము. అవ్యక్తియొక్క కార్యములను ప్రేరణ చేయవలసినప్పుడు తగిన గ్రంధమును చదువరికి మనము నిర్ణయించనిచో సంతత సమరోన్ముఖుడగు పరశురాముని బుద్ధునిగా మార్పుటకు ప్రయత్నము చేయుటయగును. ఇట్టి విపరీతములు చదువుకి అనుకూలమగు గ్రంథము లభ్యముకానప్పుడు ఏర్పడును. గ్రంథస్థ పదములను, పదములందలి వర్ణములను, పదమునుండి వాక్యములను కూర్చినప్పుడు వానియన్నిటీ యందు గ్రంథకర్త మాతృవాత్సల్యము కల్గియుండును. గ్రంథమును ప్రీతితో పఠనముకొరకు స్వీకరించుట యనగా దానిని పూజించుటయే. తల్లి తన శిశువును ఇతరులకు ముద్దాడ నందించునపుడు శిశువును అధమము ఆఇతరుడు ఆశీర్వదించవలయునని యైనను తల్లి తలంచును. నీపిల్లలయందు నీకు ఎంత ప్రేమయో ఇతరుల కూడ తమపిల్లలను అట్టి ప్రేమతో చూడవలయునని కోరుదురు గదా. నీపిల్లలు చేయు తప్పులను నీవు ఖండిందుదువుగాక ! నీ పిల్లవాని అలవాట్లు మంచివికావని నీకు సంకోచ ముండును గాక! అయినను నీపిల్లయెడల నీవు సంపూర్ణ మానవస్వభావముతోనే ప్రవర్తించెదవు. మన జీవితాభ్యుదయమునకు సాధనభూతముగా నుండు దానినే మనము స్వీకరింతును. మనము స్వీకరించిన దానియందు మనకు భక్తి యుఁడితీరును. ఇట్టి భక్తిభావము శూన్యముగానున్న పుస్తకాగారమును భారత జాతీయ ప్రతిష్ఠాపనగా పరిగణించుటకు వీలులేదు.

ధారావాహికముగా వచ్చుచున్న జాతీయజీవనమునకు అనుగుణ్యమగునట్లు అధునాతన పరిస్థితులను మార్చుటలో గ్రంథాలయమునందు దేవాలయమునందువలె పూజ్యభావము నెలకొల్పబడును, సంపూర్ణముగ పాశ్చాత్య ప్రతిష్టాపనయగు ఈ గ్రంథాలయమునకు అను గుణ్యమగు బాహ్యరూపమును పొందియు ప్రత్యక్ష విరుద్ధ లక్షణములతో కూడియున్న భారతీయ ప్రతిష్టాపన సిక్కుల గురుద్వారమును అందుపూజింపబడు గ్రంధసాహెబును, ప్రపంచ మంతటియందు ప్రసిద్దివహించిన సంయమాంద్రుల గీతాఁజలుల యొక్క సమూహమే గ్రంథసాహెబు అగుచున్నది. అధునాతన గ్రంథాలయమున కొరతబడి యున్న భక్తి పరిపూర్ణులగు చదువరులు, ఏకలక్ష్యమందు మనస్సులను లగ్నముచేసిన శ్రావకులు, గురువురు శిష్యులును వైద్యుడును రోగులను - వీరందరి ఏకత్రసమావేశమే ఈఉన్నతమగు భారతీయ పత్రిష్ణాపనము నందలి ప్రాముఖ్య లక్షణములు.

గ్రంథాలయములయందు ఎట్టి గ్రంథములుండవలెనూ విచక్షణ లేక పోవుట ఈ ప్రతిష్టాపన యందలి మూడవ నిజాతీయ లక్షణము. ప్రచురింపబడిన ప్రతిగంధమును ప్రతి మనుజునికిని అవసరములేదు. కొన్ని ప్రత్యక్షములుగా హనికరములైనవి. కొన్ని తాత్కాలికముగా ఉపయుక్తము లైనవి. కొన్ని గ్రంథములే శాశ్వతముగా భద్రపర్చతగినవి. గ్రంథాలయమును సృష్టిపై చిత్రములతో నింపిన బ్రహ్మడంముతో పోల్చిచూచినచో చవిటిపఱ్ఱలు, ఎడారులు