Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.8 (1925).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయములు సహకార సంఘములను అభివృద్ధి నొందించుచున్నవి. దీని యంతటి వలనను విజాతీయ భావములు దేశీయోవ్యమములయందు లీనమగుటచే స్వాభావికముగా తీురుగు ఏవగింపు కల్గుననియు, జాతీయాంతరాత్మయుక్క ఉత్తేజముతో అట్టి యుద్యమములు స్వాభావిక స్వరూపమును పొందుచున్నననియు మనకు బోధపడక మానదు. నిజముగా ఐరోపా గ్రంథాలయములలో ఏదియు ఇట్టిపనులకు తలపెట్టదు.

గ్రంథాలయోద్యమమందు లీనమైయున్న మొట్టమొదటి విజాతీయాభావము ఆ ప్రతిష్ఠాపనయందు ఉపదేష్టకు స్థానము లేకపోవుట. భారతీయ ప్రతిస్థాపనలలో ఏదియు మానవప్రకృతికి సహజనుగు లక్షణములేనిది లేనేలేదు. ప్రతి గ్రంథాలయమును నడుపు కార్యదర్శియు ఆద్యక్షలును గ్రంథాలయమునకు వచ్చువారితో నన్యోన్యసంబంధము కల్పించుకొనువారు కారు ముఖ్యముగా వారు పుస్తకములను సేకరింతురు. వానిని భద్రపరుతురు. వర్గీకరణ చేయుదురు.నును. ఈ వర్గీకరణము 'అ' కారాది క్రమముగ పుస్తకముల నామణులను బట్టిగాని వాని గ్రఁథకర్తలనామములనుబట్టి గాని చేయబడును గాని చదువరుల మానసఫరిణామమునుబట్టి గాని వారి అవసరములను బట్టి గాని జరుగుట లేదు. వారు చదువరులకు ఉపదేశము చేయువారమని గాని లేక చదువు కొనుటయందు సహాయము చేయువారమని గాని ఎప్పుడును చెప్పరు. ఈ గ్రంథాలయ సభ్యులు చాలవరకు యువకులుగానే యుందురు గాని వారి మానసవికాసమును నైతికాభివృద్ధిని సరియైన మార్గముల నడుపుటకు ఒక సహాయకుడు ఉండితీరవలయును. గ్రంథాలయము నిర్జీపమైనది గానుండక సజీవమై మనుష్యత్వవికాసమునకు సహాయము చేయునదిగా నుఁడవలెను. చదువరుల అధికారానుసరముగ వారలకు పుస్తకములం చదువనిచ్చిన గాని గ్రంథాలయము ఉపయోగకారి కానేరదు. చిరకాలాగతముగ వచ్చుచున్న తత్వవేత్తల యొక్కయు, కళాభిజ్ఞుల యొక్కయు పరిజ్ఞానమును భద్రపరచెడు ఊరగాయలజాడీలవంటివి గ్రంథాలయములని చెప్పనొప్పును. గ్రంథాలయము సర్వజనసామాన్యము చేయవలయునను సుత్సాహముతో ఉత్తరాధమగ్రంథములకు సమానముగ అందు స్థానమియబడు చున్నది. ఇందువలన విక్షణునా జ్ఞానములేని చదువరులకు ముప్పు వాటిల్లును. భారతీయవిధ్యామర్యాదలను పరికించుచో పఠనీయ గ్రంధముల నిర్ణయించుటయందు అధికారిభేదము బాగుగా పాటింపబడినట్లు బోధపడగలదు. రసాయనశాస్త్రజ్ఞుని రసశాలలో అజ్ఞాని ప్రవేశించి అందలి వస్తువులను ఇచ్చినచ్చినట్లు స్పృశించినచో కల్గెడు ఫలితమేమో కొంచెము యోచింపుడు. రెండవది జాతీయభానము. గ్రంథాలయములయందు గ్రంథములయెడల సవినమగు భక్తిలేగుండుట. భారతజాతియొక్క మర్యాదల ననుసరించి మనము ఏదైన పుస్తకము చదువుటకు ప్రారంభించక పూర్వము సరస్వతి, గజాశన మొదలగు దేవతా ప్రార్ధన శ్లోకములను చదువవలసియున్నది. ఆధునిక విద్యార్థులకు ఇది నిర్థకముగా తోచవచ్చును గాని అక్షరవిన్యాసము చేతను, వానిని సుస్వరముగా నుచ్చరించుట చేతేను ఎట్టిమహాశక్తులవనించుచున్నదియు, ఆశక్తులు ఆత్మీయశక్తి యొక్క వికాసమున కెట్లు సాధనభూతము లగునదియు విచక్షణాబుద్ధితో విచారించిన రూఢ మగును. మత్రంముల ప్రభావమునుగూర్చి ఇచ్చట ముచ్చటించుట అప్రస్తుతము. పుస్తకములు కేవల విద్యాసాధన ములుగనే గాక నాదనిక్షిప్తపేటికలుగ గూడ మనము పూజించివలెను. గ్రంధపఠనము పాఠకునియొక్క అధికారమును బట్టి అనేకరూపములను తాల్చవచ్చును. ఒకరు కానీపత్రికలో విమర్శను ప్రచురించుటకు చదువవచ్చును. ఇంకొకరు రాజ్యాంగపక్షమున గ్రంధమును బహిష్కరించు సుద్దేశముతో చదునవచ్చును. మరియొకరు తన పొడిత్యమును తన విద్యార్థులయెదుట ప్రగల్భములు కొట్టుకొనుటకు చదువవచ్చును. వేరొకరు కునికి పాటులు వచ్చుచున్న కాలమున ఎట్లో కాలము గడుపుటకొరకై చదువవచ్చును. మనము మన గ్రంథాలయలయందలి పుస్తకములను సర్వినియోగముచేయు నుద్దేశముతో చదువవలెనని గదా మన యాశయము, దానినుండి చదువరి సంపూరజ్ఞానము పొందవలయును. అందలి వర్ణసమామ్నాయోచ్చారణమువలనను దానియందు నిరూపణము చేయబడిన తత్వానుభవమువలనను కల్గెడి సంపూర్ణ లాభమును పొంది చదువరి అభ్యుచ్ఛయము పొందవలసి యున్నది. వర్ణములును వాని యుచ్చారణము “మహేశ్వరమాత్రములు” అవి సర్వేశ్వరుని ఆలంకారమగు వర్ణమాల. బ్రహ్మవర్ణములనుండియే ప్రపంచము సృష్టి చేసెను. అవి ప్రకృతిబీజములు. మరియు అవి ప్రపంచ పరిణామము యొక్క ప్రత్యక్ష స్వరూపము. నాదము పురుషునియొక్క ప్రధమ స్వరూపము. అది మానవుని అంత్యస్వరూపము కూడ నగుచున్నది. తక్కిన కళలు తర్వాత ఉత్పన్నమగును.