గ్రంథాలయములు — జాతీయత
పమిడిపాడు గ్రామమున జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహా సభాధ్యక్షులగు
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్యగారు ఆశువుగానిచ్చిన ఉపన్యాసమున కనువాదము.
గ్రంథాలయోద్యమమునుగూర్చి మీయెదుట ముచ్చటించుటకు నాకు సావకాశము కల్గినందుకు నేను సంతనించుచున్నాను. సూరి వేంకట నరసింహశాస్త్రి గారు ఇదివరలో ముచ్చటించినట్లు నా స్వభావమునుబట్టి రాజకీయ క్షేత్రమున కృషి నేయుటకు నేను తగినవాడను కాను. అయితే వర మానకాలమున దేశమందిలి కవులు, గాయకులు, చిత్రకారులు, అత్వవేత్తలు, ప్రకృతిశాస్త్ర వేత్తలు, సన్యాసులు మున్నగు దేశోద్దారకు లందరు దేశాభ్యుదయమునకై సర్వతోముఖనుగుకృషి చేయవలసిన సమయ మాసన్నమైనది. నా జీవితిమందలి కొన్ని సందర్భములవలన నేను రాజకీయ క్షేత్రమునకు ఆకర్షింపబడి అచ్చటనే నా యకుంఠితే ప్రయత్నము చేయవలయునను దృష్టి సంకల్పము నాకు రూఢమైనది. ఈ రెండు సంవత్సరముల అనుభవమువలన సాంఘికము, విద్యాపిషయికము మున్నుగాగల వివిధములగు మానవకృషి నంతను ఆధ్యాత్మికదృష్టితో సంస్కరించి కేంద్రీకరిపచేసిన గాని రాజకీయముగ మనము అభివృద్ధిని పొంద జాలదును మాట నాకు నిశ్చయమైనది. ఆంధ్ర గ్రంథాలయోద్యమము భారత జాతీయ సౌధ నిర్మాణమునకు ఆంధ్ర దేశమున పునాదులు వేసెనరుమాట నిశ్చయము. జాతీయోద్ధారణ సాధకములగు అన్ని సదుద్యమాములకు ఆంధ్ర గ్రంథాలయములు ఉనికిపట్టువులుగా నుండు ననుమాట నిశ్చయము. గ్రంథాలయోద్యమము విద్యావిధానమున అంతర్భాగముగా నెంచబడతగినవియున్నది. ఇదివరకు ఈ యుద్యమ పక్షమున ఇట్టి కృషియే జరిగి యున్నది, ఈ సభకు అధ్యక్షుడుగా నుండుమని నన్ను కోరినందుని ఈ యుద్యమము యొక్క స్వభావములకు నిర్ణయించుటకును ఇందులీనమైయున్న నిజాతీయతను తొలగించుటకును ఈ సావకాశమును నేను సద్వినియోగము చేసికొనుచున్నాను. మద్రాసు అఖిల భారత సభలో ఈ యుద్యమమును గూర్చి నేను చేసిన ప్రశంస పూర్వపక్షముగను వర్తమానో పన్యాసము సిద్ధాంతముగను ఎంచవలయును.