Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.8 (1925).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ రామనామ స్మరణ

ప్రమాణము చేసెదరు గాని పిమ్మట వ్యామోహము కలిగినపుడు లొంగిపోయెదరు, అట్టిస్థితిలో భగవంతుడే ఆధారము. అందువలన రామనామస్మరణ చేయవలెనని నేను వారికి బోధించితిని. సర్వాంతర్యామి, సరేశ్వరుడు, ఏకోనారాయణుడు, అల్లా, దేవుడు, మున్నగు నామములన్నియు ఏపరమేశ్వరునకు వర్తించుమో ఆపరమేశ్వరుఁడే రాముడని నా అభిప్రాయము గాన నేను వారికి రామమంత్రమును పదేశించితిని. వారు మూఢ విశ్వాసమువలన నేనే తమ పాలిటి దైవమునని తలచుచున్నారు. ఆ అజ్ఞానమును పోగొట్టవలెను. నాబోటి ఆశక్తుఁడగునొకమానవుడే దైవమను దుర్బ్రామను తొలగించవలెను. కోట్లకొలదిభక్తుల నాపదలనుఁడి యుదరించిన రామ నామ మహిమ జగద్విదితముగా నా మహామంత్రమును వారి కుపదేశించిరి. ప్రతిదినమున నుదయమున సూర్యోదయాత్పూర్వ రాత్రి పరండబోవు టకు ముందును రామనామమును స్మరింపపలెని నేను వారిని కోరితిని. పర్వేశ్వరుని రాముడను పేరుతో పెక్కు కోట్లమంది హిందువులు ధ్యానించి తరించి చున్నారు. నీకు భయము వేసినపుడు రామనామమును స్మరింపుచుని పనితనమున నా పెద్దలు నాకు బోధించిరి. ఆపత్కాలముని రామనామమును స్మరించి నామిత్రులెందఱో చిత్తశాంతినిబడసియుండునే నెరుగుదురు. కావుననే ధారాలాలకును నిమ్నజాతులకును ఆపన్నివారికమగు రామమంత్రమును నే మపదేశించితిని. పాండత్య విశేషమన గర్వము కన్నలగ్రమ్మనివారును, అహంభావము ముదురని వారును, భక్తి నశించనివారునగు దేశీయులు హిఁదువులఁదరును రామనామస్మరణ చేయవలెననియే నేను కోరెదను. పాండిత్యము మనజీవితములో చాల సోపానముల నెక్కించునుగాని ఆపద, వ్యామోహము మున్నగునవి కలిగినపుడుమాత్రము నిరుపయోగమేయగును. అపుడు భగపద్భక్తియే మనకు శరణ్యము. దైవభీతి కలవారికిని పాపకార్యములను చేయగూడదని కోరుచుండినను వ్యామోహమును గెలువఁజాలని వారికినిమాత్రమే రామనామము రక్షక మగును.


౼ మో.క.గాంధీ