౪ నిజాం రాష్ట్రాంధ్ర గ్రంథాలయోద్యమ వ్యాప్తినిమిత్తము గ్రంథాలయ సంఘ మొకటి స్థాపించుట యవసరమని యీసభవారు అభిప్రాయపడుచూ దీని కార్యప్రణాళికను తయారు చేయుటకై యీ క్రింది సభ్యులుగల ఉపసంఘమును ఏర్పాటు చేయుచున్నారు. ఆ నివేదికను త్వరలో (అనగా మూడుమాసములలో) ప్రత్యేక గ్రంథాలయ ప్రతినిధుల సభ సమావేశపరచి ప్రవేశపెట్టవలెనని తీర్మానించుచున్నారు.
ఒక విలేఖరిచే వ్రాయబడిన వృత్తాంతము
ఆదివారము ఉదయమంతయు సభ్యులు ఇష్టాగోష్ఠి ప్రసంగములతో కాలయాపనము గావించిరి. మధ్యాహ్నము 1½ గంటలకు వడ్డెపల్లి దేశమఖులగు శ్రీయుత పింగలి వేంకటరామారెడ్డి దొరగారు నిజాఁరాష్ట్రఆంధ్రగ్రంథాలయ సభాధ్యక్షత వహింపవలెనని స్థానికులు ఆహ్వాన సంఘాధ్యక్షులు నగు శ్రీమాడపాటి తిరుమలరావుగారు స్వాగతోపన్యాసము చదివిరి. అధ్యక్షులగు శ్రీయుత పింగలి వేంకటరామ రెడ్డి గారు విపులముగు అధ్యక్షోపన్యాపము చదిపిరి. పిదప గ్రంథాలయోద్యమమును గూర్చి బెజవాడ వాస్తవ్యులను సూరి వేంకట సరసింహశాస్త్రిగారు భారతదేశ గ్రంథాలయములను గూర్చియు, నిజాఁరాష్ట్రఆంధ్రగ్రంథాలయమును గూర్చియు గంభీరోపన్యాసము మొసంగిరి. పిమ్మట శేషాదిరమణ కవులలో నొకరగు వేంకట రమణాచార్యులుగారు తమ పరిశోధనానుభవముల గూర్చి విపులముగా వివరించి చెప్పిరి. అనంతరము అధ్యక్షులు వక్తల ఉపవ్యాసరుల ప్రశంనించిరి. తరువాత గ్రంథాలయోద్యమాభిరూనులును విద్యాధికులునగు యువకులు కొందరు నిజాంరాష్ట్రాంధ్రజన కేంద్రసంఘమునుండి గ్రంథాలయ సంఘమును విడదీయవలయునను నభిప్రాయమును సూచించిరి. పిదప అధ్యక్షులు కాలహరణములతో బసలేదని తెలుపుచు 'ఆంధ్ర కేంద్ర సంఘములు గ్రంథాలయ సంఘమున కలుపవలయునా? వలదా? నియమము లెవ్వియను నంశము ముందు జరుపబోవు సమావేశములో జర్చింపదగినదని అధ్యక్షులు తీర్మానించి సభ విరమించినారలు. సభ్యులలో మఖ్యముగా నొక విధమగు సంచలనముకలిగెను. అనంతరము వందనములతో సభ ముగింపఁబడెను. నాటీసభకు సుమారు 200 మంది ప్రతినిధు లేతెంచియుఁడిరి. శ్రీ శేషాద్రి రమణకవులు అధ్యక్షులనుగూర్చి సభ్యులనుగూర్చి కొన్ని పద్యము చదివి యానందపఱచిరి, సభ 5 గంటలకు ముగింపబడేను.
పైన వివరించిన ప్రకారము సభ ముగింపు అయిన పిమ్మట, కేంధ్రగ్రంధాలయా సంఘము నిర్మాణింపఁబడకపోవుట పరితాపకరమని ప్రత్యేకముగా ప్రతినిధులందరును సమావేశమై తీర్మానించి అధ్యక్షులకంపి కదలిక కలిగిందగా భోజనానంతరము రాత్రి 10 గంటలకు మఱల గ్రంథాలయ సంఘసభ జరిగినది. సభ్యులు ఉత్సాహముగా పాల్గొనిరి. ఆసభయందు గ్రంథాలయ సంఘమును స్థాపింపవలయునని ఆ సంఘ నియమములను ఉపసంఘమువారు తయారు చేయవలయునను తీర్మానము ఎంతయో చర్చమీద అంగీకరింపబడెను. సభ రాత్రి 12 గంటలకు ముగింపబడెను,
భారత వర్షమందరీలి ప్రాచీన సరస్వతీ భాండారములు
(మొగలాయి చక్రవర్తుల గ్రంథాగారములు) ఆఱు శతాబ్దముల కాలమును మనదేశము మొగలాయీ! ప్రభువు లేలియుండిరి కదా! కావున నీ ప్రభువుల కాలమున మనదేశమునందు విద్యయు జ్ఞానమును యేరీతిని వ్యాప్తి జేందినదియు తెలిసికొందము. మహమ్మదీయులు దేవాలయములను, మఠముల నాశనము చేసినకొలదని, మన విజ్ఞానేశ్వద్యము. ఉత్తర హిందూదేశ పర్వత ప్రాంతముల కెట్లు పారిపోయి తలదాచు కొనినదియు ఇదివరికే వినియుంటిరే. అదేరీతిని హిందూ