చుట సత్వరాభివృద్ధికి శుభసూచకమగును. ఇట్టి గ్రంథాలయములకు లోకఫండునుండి ద్రవ్యసహాయము చేయబడునన్న నమ్మకము గలదు. ప్రభుత్వమువారి సానుభూతియు, విద్యాశాఖాధికారుల సహాయమును లభించగలదు.
నిజాంరాష్ట్రంధ్ర దేశములో గ్రంథాలయస్థాపన విషయమున నెంతవరకు కృషి సలుపబడినదో అరయుదము.
౨౪ సంవత్సరములకు పూర్వము హైదరాబాదులో స్థాపింపబడిన శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషానిలయము నిజాంరాజ్యములోనేగాక ఆంధ్రదేశము నంతకును, సక్రమపద్ధతుల పైన స్థాపించబడిన గ్రంథాలయములలో మొట్టమొదటిది. ఇయ్యది నిజాంరాష్ట్రాంధ్రుల యభివృద్ధికై పునాదిగా బనిజేసి స్వంతభవనముతోను పలువిధిసౌకర్యములతోను, అధిక సంఖ్యాకములైన సంస్కృతాంధ్ర గ్రంథములతోను విరాజిల్లుచున్నది. ప్రజలచే నడుపబడు ఆంధ్ర సంస్థలలో కెల్ల నీ రాజ్యమునందిది ఆగ్రస్థానము వహించినది. దీనితరువాత జేర్కొన దగినవి సెకంద్రాబాదు, హనుమకొండ, మట్టెవాడ, ఎఱ్ఱుపాలెము నున్నగు స్థలములలో నెలకొల్పబడిన గ్రంథాలయములు. దయామయులై ప్రజలయభివృద్ధికై విశ్వప్రయత్నములను జేయుచున్న మన ప్రభువుగారి పవిత్రనామముతో నిచ్చట మధిరయందు నెలకొల్పబడిన ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయము యొక్క వార్షికోత్సవము నిన్ననేగదా జరిగినది! మటైవాడ, హనుమకొండలో నున్న గ్రంథాలయములకు ప్రతిమాసము ౧౫౧౧ రూపాయిల చొప్పున ప్రభుత్వమువారు గ్రాంటు దయచేయుచున్నారు.
ఆంధ్రజన సంఘోద్యమమారంభమైన గత మూడు సంవత్సరముల కాలములో గ్రంథాలయముల సంఖ్య చాలవరకు హెచ్చినది. ప్రస్తుతము వీని సంఖ్య ౮౩ వరకు వచ్చినదని తెలియుచున్నది. నూతన గ్రంథాలయములను స్థాపించు ప్రయత్నములతో బాటు స్థాపిఁపబడినవన్నియు సక్రమముగ నడుపబడుతుఁడుంది లేనిది అవలోకించుట కేర్పాట్లుచేయట కేంద్రసంఘము వారి విధియైయున్నది. ఈ కార్యము నిధిపైన నాధారపడియున్నది గనుక దేశీయులు ఉదార భావముతో ద్రవ్యసహాయము చేయవలెను.
గ్రంథాలయముల లాభములను గురించి గాని వాని పాలననుగురించి గాని నేను ప్రత్యేకముగ చెప్పవలసిన దేదియు లేదు. గ్రంథాల యోద్యమమునందు కృషి సలుపుచు తదభివృద్ధికై ప్రయత్నములు సలుపుచున్న యనుభవజ్ఞులు తన యభిప్రాయములను దెలుప వేడుచున్నాను,
గ్రంథాలయముల కనుబంధముగ నాటక సంఘములను, అన్నదాన సమాజములను, రాత్రిపాఠశాలలను, వినోదకరములగు ఆటపాటల క్లబ్బులను జేర్చవచ్చునని కొందరభిప్రాయ పడుచున్నారు. కాని దీవివలన గ్రంథాలయములు క్షీణించుటయు, నశించుటయుగూడి సంభవింపవచ్చునని నాయభిప్రాయము. గ్రంథాలయ కార్యనిర్వాహకులు ఇతరోద్యమముల ఫలసిద్ధికై ఆశించినచో గ్రంథాలయాభివృద్ధి విషయమున సఫలీకృత మనోరధులు కాజాలరు. భినృద్ధివిషయమ
పలువిధోద్యమములందు కృషి సలుపుటకు సమకటీన కేంద్ర సంఘమునందు గ్రంథాలయశాఖ ప్రత్యేకముగ నేర్పడవలయును. ప్రతియుద్యమునకు ప్రత్యేక శాఖల నేర్పరచవలెననెడి యుద్దేశ్యమున్నట్లు ఇదివరకేర్పడిన పరిశోధకశాఖవలన దెలియుచున్నది. గ్రంథాలయములన్నియు కేంద్ర సంఘముయొక్క ప్రాపకము నఁగీకరించినచో వారి స్వాతంత్యమునకు గాని ప్రత్యేకకృషికి గాని భంగము వాటిల్లకుండు విధమున కేంద్రసంఘ గ్రంథాలయ శాఖవలన సహాయమును బొందవచ్చును. గ్రంథాలయోద్యమ ప్రయత్నములు దీనివలన కేంద్రీకరింపబడి సమత్వము అన్నిటియందేర్పడును. ఈవిషయమును గురించియు, దీనియందలి సాధక బాధకములను గురించియు ప్రతినిధులందరాలోచించెదరు గాక!
తీర్మానములు
౧ మహా ఘనతవహించిన మన నిజాము ప్రభుత్వమువారు గ్రంథాలయోద్య మాభివృద్ధియెడ చూపుచున్న సానుభూతికిని, వాడొనర్చుచున్న సహాయమునకును ఈసభవారు కృతజ్ఞతను ప్రకటించు చున్నారు.
౨ నిజాంరాష్ట్ర ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యము విషయమున జేయుచున్న ప్రయత్నములకు గాను ఆంధ్రజన కేంద్ర
సంఘమువారిని ప్రశంసించుము ఉద్యమప్రచారమునకై ప్రత్యేకమగు ఏర్పాటు చేయుటకు వారిని ఈ సభవారు కోరుచున్నారు.
3 మహాఘనత వహించిన నిజాము ప్రభుత్వమువారు కొన్ని గ్రంథాలయములకు గ్రాంటులనొసగి చేయుమున్న సహాయమునకు ఈసభవారు కృతజ్ఞతను గనబరుచుచు తక్కినవారిని గూడ ద్రవ్యసహాయము చేయవలయునని ప్రార్థించు చున్నారు.