Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.8 (1925).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయిన చిత్తరువులును మనకు తిరిగి సంగ్రహమగును. ప్రాచీనపండితుల వైదుష్యలాభము దేశము పొందగలదు. జాతివర్ణ విచక్షణ లేకుండా “సర్వేజనాః సుఖినోభవంతు" అను న్యాయానసారమున బీదజనులకు అన్నదానము అచ్చట చేయవలెను. అనాథలకు అచటశరణ్యము చేకూరవలెను. బీదలకు అన్నదానము అందరకును ఆదరణీయమే. ఈపని వెఁటనే వూనుకొనవలసి దైయున్నది. అనాథలను జాడ్యగ్రస్తులను సంరక్షణ చేయుట అవశ్యాచరణీయము. ఈ విధిని కూడ గ్రంధాలయములు నిర్వర్తించవలసియున్నది. గ్రంథాలయ నిర్వహణములో ముఖ్యముగ గమనించవలసిన విషయమొకటియున్నది. ఈ ప్రతిష్ఠాపనలు సర్వజనసమాదరణీయముగా నుండవలేను. తగాదాలను పెంచు విషయములలో గ్రంథాలయము లెన్నడును దిగకూడదు. భారతజాతియొక్క పరమ లక్ష్యమును, జీవిత పరమావధియు ఈశ్వర సృష్టి యందలి ఐక్యభావమును అనుభవములోనికి తెచ్చుటకు గ్రంథాలయములు నిరంతరము కృషి చేయుచుఁడవలేను. గ్రంథాలయభవనమందైనను అచ్చట సమావేశమగు స్వల్పకాలమువరకైనను అయ్యోన్య సౌజన్యము కల్గి యుండునట్లు మనము పరిస్థితుల నేర్పర్చుకోవలెను. జగన్నాథస్వామి దేవాలయమందు జాతిపిచక్షణలేక అందరికి ఎట్లు ప్రవేశమున్నదో గ్రంథాలయమందు కూడ నల్లే జాతిమతనిక్షణలేకుండ ప్రవేశముండవలయును. స్వరాజ్య సౌధనిర్మాణముకు ఈ గ్రంథాలయములు ప్రధమపునాదులుగా నుండును.

మనకు ఇక జాగుచేయకూడదు. మన భావిభాగ్యము త్రాసులో ఊగులాడుచున్నది. పాశ్చాత్య దేశమున సుద్భవించినదను కారణమున గ్రంథాలయమును గాని మరియే ఇతర ప్రతిస్థాపననుగాని మనము త్యజించకూడదు. భ్రమర కీటన్యాయానుసారముగా ఏప్రతిస్థాపన నైనను మన జాతీయ జీవనమును కనుగుణ్యమగునట్లు మనము చేసుకొనవలసి యున్నది.

గ్రంథాలయోద్యమముయొక్క పూర్వ వృత్తాంతమును గూర్చి నేను ఖండించను. నిశ్చితలక్ష్యము ననుసగించకుండ పలుత్రోవలు వం తొక్కుచు ఈ యద్యమము ఇదివరలో కృషి చేసియున్నది. కొన్ని సత్కార్యములు కూడ ఈ యుద్యమపక్షమున జరిగినవి. గుంటూరు మండల గ్రంథాలయ సంఘమువారు ప్రచురించిన కరపత్రములు నిరర్ధము లైనవి. ఈ యుద్యమము నిర్ణీత ప్రాప్యము కలదై దేశాభ్యుదయముకొరకు కృషిచేయు ఇతరోద్యమములతో ఉచితమగు సంబంధములు కలదిగా నుండవలెను. విస్పష్టమగు కార్యప్రణాళికను నిర్ణయించు కొనవలసినదని మిమ్ములను కోరుచున్నాను.


జనార్దన కుడాల్కారు

బగోడా సంస్థానాధీశుడు 1910వ సంవత్సరము నందు ధర్మ గ్రంథాలయోద్యమమును తన జనుల జ్ఞానాభివృద్ధికిగాను ప్రారంభించెను. తాను ప్రవేశ పెట్టిన నిర్బంధ ఉచిత ప్రారంభ విద్యకు తోడుగా తన రాష్ట్రమంతటను గ్రంథాలయములను స్థాపించి, ఈయుద్యమమును వ్యాపింపజేయుటకుగాను బరోడా మహారాజు గారు అమెరికా దేశము నుండి "బోర్డ౯" ఆను నాయనను పిలిపించెను. ఆయనకు సహాయకుడుగా నియమింపబడి, ఆయన తన దేశమునకు తిరిగి పోయిన పిమ్మట గ్రంథాలయపాలకుడుగా నియమింపబడి, బరోడా గ్రంథాలయోద్యమాభివృద్ధికి పట్టుకొమ్మయై విలసిల్లీ మనకథా నాయకుడగు శ్రీ జనార్ధనకుడాల్కరు గారు 1921వ సంవత్సరములో ములో పరమపదవినొందుట వలన ఆయుద్యమమునకు తీరని నష్టము వాటిల్లినది.

ఆయన 1882 సంవత్సరములో జననమొందెను. ఆయన తండ్రి మిక్కిలి బీదవాడు. కులముచేత విశ్వబ్రాహ్మణులు. ఇతని జననమునకు పిమ్మట కొలదికాలమునకే తండ్రి చనిపోయెను. అయినను పట్టుదలతో కష్టపడి చదివి, విద్యార్థి వేతనములను బొంది 1905 సంవత్సరమునఁదు ఎం. ఏ. పరీక్షయం దుత్తీర్ణుడయ్యెను.

లాహోరు దయానంద ఆంగ్లో వేదకళాశాలయందు 1909 సంవత్సరమువరకు ఆయన సంస్కృత ఉపాధ్యాయులుగా నుండిరి. ఆ సంవత్సరమునందాయన బరోడా మహారాజు గారి రాజమందిర గ్రంథాలయమునకు గ్రంథభాండా గారికుఁడుగా నియమింపబడెను. పిమ్మట 1910 సంవత్సరమునందు గ్రంథాలయోద్యమ వ్యాపనారమై అమెరికా దేశమునుండి బోర్డను దొరగారు రాగా వారికి ప్రధాన సహకారిగా నియమింపబడెను.