తృతీయ అఖిలభారత గ్రంధాలయ ప్రతినిధుల మహాసభ
కర్నాటక రాష్ట్రమునందున్న బెల్లాఁపట్టణ పరిసరమునందు కాంగ్రెసునకై ప్రత్యేకముగ నిర్మితమైన విజయ నగరమునందు 1924 స౹ డిశంబరు నెల 26 తేదీ ఉదయ మ 8-30 గంటలకు ఈ సభ సమావేశమయ్యెను.
భారతవర్షము యొక్క వివిన భాగములనుండి ౧౫౦ మంది ప్రతినిధులు విచ్చేసిరి. మైసూరు, పుదుక్కోట సంస్థానములనుండియు, బొంబాయి విశ్వవిద్యాలయమునుండియు గూడ ప్రతినిధు లెతెంచిరి. ఇతర సభలతో సంబంధములేకుండ ప్రత్యేక మీ సభకు గూడ కొంతమంది ప్రతినిధులు విచ్చేసియుండిరి. భారతవర్షము యొక్క వివిధప్రాంతములనుండి పెక్కుమంది ప్రేక్షక మహాశయులుగూడ విచ్చేసియుండిరి.
ప్రార్ధనతో సభ ప్రారంభింపబడెను. ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ డి.కే. భారద్వాజగారు ప్రతినిధులకు హృదయపూర్వకమగు స్వాగతమిచ్చిరి. వారి యుపన్యాపమునందు ప్రస్తుత దేశ స్థితిగతులను చర్చించి, దేశము నిప్పుడు కలవరబెట్టుచున్న అసంఖ్యాక ములగు సమస్యలను గూర్చి జనసామాన్యమునకు జ్ఞానాభివృద్ధిని గలుగజేయుటకుగాను గ్రంథాలయములను స్థాపింప వలసిన యావశ్యకతను విపులముగా జర్చించిరి. తదుపరి దేశబంధు చిత్తరంజనదాసుగారు అధ్యక్షత వహించవలెనని ఉపాదించుచు వేమవరపు రామదాసు పంతులు గారు, దాసు గారు గ్రామజీవన పునర్నిర్మాణమునకై ప్రారంభించిన నూతన కార్య క్రమమును గూర్చి వివరించి స్వసహాయ విలసితమును స్వపరిపాలనా భాసితంబునునగు గ్రామమునందు గ్రంథాలయము ప్రాధాన్య భాగమై యున్నదని చెప్పిరి. వీరి యుపపాదనను జి.హరి సర్వోత్తమరావుగారు కన్నడభాష యందు బలపరిచిరి. మైసూరు సంస్థాన ప్రతినిధియగు సి.చంద్రశేఖరయ్యరు గారు కూడ ఈ యుపపాదనను బలపరచుచు దేశబంధుదాసు గారు జనులయొక్క నిజమైన దాసుడనియు అందుచేత ఈ సభాధ్యక్షత వహింప దాసుగారు అన్ని విధముల నర్హులనియు జెప్పిరి. అప్పుడు వందేమాతర ధ్యానములు జిలఁగుచుఁడ దేశబంఘ “దాసుకీ జై” అను కేకలు మిన్నుముట్టుచుండ దామగారు అధ్యక్ష పీఠమలంకరించి ఈ క్రింది విధమున ఉపన్యాసమిచ్చిరి.
అధ్యక్షకోపన్యాసము
ఈ సభకు అధ్యక్షత వహించుట నాకెంతయో ఆనందముగ నున్నది. ఏలయనగా ఈ యుద్యమము ప్రజల